అమ్మకు పెళ్లి చేస్తా.. అబ్బాయితో కాదు.. అంకుల్‌తో: సుప్రీత ఓపెన్ కామెంట్స్

అమ్మకు పెళ్లి చేస్తా.. అబ్బాయితో కాదు.. అంకుల్‌తో: సుప్రీత ఓపెన్ కామెంట్స్

ప్రముఖ నటి సురేఖా వాణికి ఇటీవలి కాలంలో అవకాశాలు రావడం లేదు. ఈ క్రమంలోనే తన కూతురి సుప్రీతని హీరోయిన్ చేయాలని తపించి చివరకు ఒక మూవీలో అయితే అవకాశం దక్కేలా చేసింది.  బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ కి జంటగా ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్‌లో సుప్రీత నటిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ కొన్ని యూట్యూబ్ ఛానళన్లకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తల్లి సురేఖావాణి రెండో పెళ్లి గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. గతంలో సురేఖావాణి రెండో పెళ్లి వార్తలొస్తే ఖండించింది సుప్రీత. ఇప్పుడు తల్లి పెళ్లిపై ఓపెన్ అయిపోయింది. సురేఖా వాణి కూడా గతంలో నచ్చిన వాడు దొరికితే పెళ్లి చేసుకోకున్నా.. డేటింగ్ చేస్తానని తెలిపింది. అయితే అతనికి మంచి హైట్, ఫిజిక్, నిండు గడ్డం ఉండాలట. ఇక సుప్రీత ఏం కామెంట్స్ చేసిందో తెలుసా?

మీ అమ్మకు రెండో పెళ్లి చేసే ఆలోచన ఉందా? అని సుప్రీతను ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. రెండో పెళ్లి చేయాలని ఉందని తెలిపింది. అయితే తన తల్లికి అబ్బాయిలు సెట్ కారని… అంకుల్స్ అయితే సెట్ అవుతారని తెలిపింది. ఇప్పటికే తన తల్లిని బాగా చూసుకునే ఒక మంచి అంకుల్‌ని వెతికే పనిలో ఉన్నానని వెల్లడించింది. అలాగే అతనికి చెడు ఆలోచనలు ఏమీ ఉండకూడదట. అలాంటి వ్యక్తి దొరికితే వెంటనే పెళ్లి చేస్తానని సుప్రీత తెలిపింది.

Google News