రష్మికతోనే విజయ దేవరకొండ పెళ్లి.. క్లారిటీ ఇచ్చేశాడు..!

రష్మికతోనే విజయ దేవరకొండ పెళ్లి.. క్లారిటీ ఇచ్చేశాడు..!

గీత గోవిందం దర్శకుడు పరశురామ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో మరో సినిమా రానుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో ఇద్దరూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరోసారి గీత గోవిందం మ్యాజిక్ పక్కా అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

తాజాగా విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ముఖ్యంగా తన పెళ్లి గురించి విజయ్ స్పందించాడు. తనకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉందని.. అయితే ఇప్పుడే చేసుకోనని తెలిపాడు. దానికి ఇంకా సమయం ఉందని తెలిపాడు. అయితే పెళ్లి చేసుకుంటే మాత్రం పక్కాగా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తెలిపాడు.

అయితే అమ్మాయి మాత్రం తన పేరెంట్స్‌కి నచ్చాలని తెలిపాడు. ఇక విజయ్ చెప్పిన మాటలు హీరోయిన్ రష్మిక మందన్నా గురించేనని అంతా అంటున్నారు. ఇప్పటికే వీరిద్దరి రిలేషన్‌షిప్‌కి సంబంధించి చాలా వీడియోలు బయటకు వచ్చాయి. ఇద్దరూ టైం దొరికితే చాలు.. వెకేషన్‌కి సైతం వెళుతున్నారు. కాబట్టి విజయ్ చెప్పిన మాటలు రష్మిక గురించేనని అంతా బలంగా నమ్ముతున్నారు. కొంతకాలం వెయిట్ చేస్తే తప్ప దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.