‘ఘర్షణ’ ఫేమ్ డేనియల్ బాలాజీ మృతి

'ఘర్షణ' ఫేమ్ డేనియల్ బాలాజీ మృతి

ప్రముఖ న‌టుడు డేనియ‌ల్ బాలాజీ (48) క‌న్నుమూశాడు. శుక్రవారం అర్ధరాత్రి అతనికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి తరలించారు. కానీ హాస్పిటల్‌కు చేరుకోవడానికి ముందే బాలాజీ మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. 48 ఏళ్ల బాలాజీ ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. అవడానికి కోలీవుడ్ నటుడు అయినా కూడా పలు భాషల్లో నటించి మెప్పించాడు.

ఎక్కువగా విలన్ పాత్రలే పోషించిన బాలాజీ సౌత్‌ ఇండియాలోని అ‍న్ని భాషల్లో సుమారు 50కి పైగా చిత్రాల్లో నటించాడు. టాలీవుడ్‌లో సాంబ, ఘర్షణ,చిరుత,టక్‌ జగదీష్‌, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. కమల్ హాసన్సినిమా ‘మరుదనాయగం’ సెట్స్‌లో యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్‌గా బాలాజీ తన కెరీర్‌ని ప్రారంభించాడు. అయితే ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు.

Advertisement
'ఘర్షణ' ఫేమ్ డేనియల్ బాలాజీ మృతి

తెలుగులో పిన్ని పేరుతో డబ్ అయిన సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగు పెట్టాడు. ఈ సీరియల్ మంచి హిట్ అయ్యింది. ఈ సీరియల్‌లో డేనియల్ అనే పాత్రలో నటించడంతో ఆయన పేరు డేనియల్ బాలాజీగా స్థిరపడిపోయింది. డేనియల్ బాలాజీ తండ్రి చిత్తూరు జిల్లాకు చెందినవారు కాగా.. తల్లి తమిళ్ కుటుంబానికి చెందిన వ్యక్తి. డైరెక్టర్ కావాలనే ఆశతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చివరకు నటుడిగా బాలాజీ స్థిరపడిపోయారు.