హనుమాన్ 2 గురించి ప్రశాంత్ వర్మ అదిరిపోయే అప్‌డేట్..

హనుమాన్ 2 గురించి ప్రశాంత్ వర్మ అదిరిపోయే అప్‌డేట్..

టాలీవుడ్‌కు కొత్తదనాన్ని పరిచయం చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆయన ఇప్పటి వరకూ రూపొందించిన చిత్రాలు అ, కల్కి, జాంబిరెడ్డి, హనుమాన్ చిత్రాలన్నీ మంచి సక్సెస్ సాధించాయి. ఒక చిత్రానికి మరో చిత్రంతో పోలికే లేదు. దేనికదే స్పెషల్. ప్రశాంత్ వర్మ నుంచి హనుమాన్ వంటి ఒక చిత్రం వస్తుందని ఎవరూ ఊహించలేదు. తేజా సజ్జా హీరోగా చిన్న చిత్రంగా రూపొందిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

బడా హీరోలతో పోటీపడి మరీ హనుమాన్ చిత్రం 2024 సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ సినిమా విడుదల ఆపేందుకు చాలా ప్రయత్నాలు జరిగినా కూడా అది జరగలేదు. ఇక హనుమాన్ ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అసలు తేజా సజ్జా వంటి చిన్న హీరోకి ఈ రేంజ్ వసూళ్లు రావడం చూసి ఇండస్ట్రీయే షాక్ అయ్యింది. తాజాగా ప్రశాంత్ వర్మ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.

అంజనాద్రి 2.0, వెల్కమ్ టు జై హనుమాన్ పేరటి ఒక పోస్ట్‌ను ప్రశాంత్ వర్మ పెట్టారు. ఆయన షేర్ చేసిన వీడియో మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. వీడియోలో కొండల మధ్య ఒక పెద్ద నది.. బ్యాక్ గ్రౌండ్ లో ఆంజనేయ స్వామి శ్లోకంతో ఇది మనసుకు ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగించేలా ఉంది. ఈ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన పనులు ప్రారంభించినట్టుగా వీడియోతో ప్రశాంత్ వర్మ తెలిపారు.

Google News