‘ఫ్యామిలీ స్టార్’కి విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

'ఫ్యామిలీ స్టార్'కి విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

‘గీతగోవిందం’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ, పరశురాం కాంబోలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంతో మంచి సక్సెస్ అందుకోవాలని విజయ్ దేవరకొండ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ క్రమంలోనే బీభత్సంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఏప్రిల్ 2న ఈ చిత్రానికి సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారట. దీంతో అందరి చూపూ ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ పైనే ఉంది. ఇప్పటి వరకూ విజయ్ దేవరకొండ నటించిన చిత్రాల్లో భారీ సక్సెస్ స్థానంలో గీత గోవిందం కూడా నిలుస్తుంది. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ రూ.12 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నాడని టాక్.

Advertisement
'ఫ్యామిలీ స్టార్'కి విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

ఇక ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ మూవీకి అంతకు మించిన రెమ్యూనరేషన్‌ను విజయ్ దేవరకొండ అందుకున్నాడట. ఈ సినిమాకు విజయ్ రూ. 15 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం తొలుత తెలుగు, తమిళ్‌లో రిలీజ్‌ కానుంది. ఈ రెండు భాసల్లో రిలీజైన రెండు వారాల తర్వాత హిందీలోనూ విడుదల కానుందని టాక్. ఇక ఈ చిత్ర ప్రి రిలీజ్ బిజినెస్ అన్ని ఏరియాల్లో కలిసి రూ.45 కోట్ల మేర బిజినెస్‌ చేసిందట.