అలాంటి అబ్బాయిలుంటే రండి.. రింగ్ తొడిగేస్తా: మృణాల్ ఠాకూర్

అలాంటి అబ్బాయిలుంటే రండి.. రింగ్ తొడిగేస్తా: మృణాల్ ఠాకూర్

‘సీతారామం’ సినిమాతో యువకుల గుండెల్ని కొల్లగొట్టిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా మృణాల్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూకి హాజరైంది.

తనకు యాక్టర్ అవ్వాలనే ఆలోచన అయితే లేదని.. చిన్నప్పటి నుంచి కూడా మిస్ వరల్డ్ అవ్వాలనే కోరిక ఉందట. అయితే బికినీ వేసుకోవాల్సి ఉందని డ్రాప్ అయ్యిందట. ఇక తనకు హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ అంటే ఇష్టమని.. వాళ్లతో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని మృణాల్ ఠాకూర్ తెలిపింది. ఇక తన పెళ్లి తదితర విషయాలపై సైతం మృణాల్ ఈ ఇంటర్వ్యూలో స్పందించింది. తనకు కాబోయే వరుడు రాముడి లాంటి వాడు అయ్యుండాలట.

నిజంగా రాముడు లాంటి అబ్బాయిలు ఉంటే తక్షణమే తనను కలవాలని.. రింగ్ కూడా రెడీగా ఉందని.. తొడిగేస్తానని చెప్పింది. సెలబ్రిటీగా ఉండటంతో తనకు ఇంత అభిమానం దొరికిందని.. అందుకు చాలా హ్యాపీ అని కానీ ఒక్కోసారి తనకు సాధారణ జీవితాన్ని గడపాలని అనిపిస్తూ ఉంటుందని తెలిపింది. ఇరవైల్లోనే పెళ్లి చేసుకుని.. పిల్లల్ని కంటే.. కోరుకున్నప్పుడల్లా డిన్నర్ కోసం ఎలాంటి పరిమితులు లేకుండా రెస్టారెంట్‌కు వెళ్లి రావొచ్చని తెలిపింది. ఇక తనను అత్యంత భయపెట్టే విషయం మరణమని తెలిపింది. తాను లేకుంటే తన కుటుంబం ఏమవుతుందోనన్న భయమే దానికి కారణమని తెలిపింది. 

Google News