పీకల్లోతు ప్రేమలో పూజా హెగ్డే.. అబ్బాయి ఎవరో తెలిస్తే షాక్ అవడం ఖాయం..

పీకల్లోతు ప్రేమలో పూజా హెగ్డే.. అబ్బాయి ఎవరో తెలిస్తే షాక్ అవడం ఖాయం..

పూజా హెగ్డే.. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి.. వరుస ఫ్లాపులతో ఢమాలున పడిపోయిన హీరోయిన్. ఈ ముద్దుగుమ్మ గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాను ఓ కుదుపు కుదిపేస్తోంది. అదేంటంటే ఓ బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందట. ఇప్పటికే ఆ హీరో ఓ ముద్దుగుమ్మకు బ్రేకప్ చెప్పేశాడని టాక్. ఇంతకీ ఆ హీరో ఎవరంటారా?   బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రా(33).

రోహన్, పూజా కలిసి ముంబైలోని హోటళ్లన్నీ చుట్టేస్తున్నారట. ఇద్దరూ కలిసి కారులో షికారు చేస్తున్నారట. ఈ దృశ్యాలన్నీ బయటకు రావడంతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ టాక్ నడుస్తోంది. రోహన్ మెహ్రా కూడా ఇది వరకే స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 ఫేమ్‌ ‘తారా సుతారియా’తో రిలేషన్‌షిప్‌ను కొంతకాలం నడిపి ఆ తరువాత బ్రేకప్ చెప్పాడట. ఇప్పుడు పూజా హెగ్డేతో ప్రేమాయణం. మొత్తానికి ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పీకల్లోతు ప్రేమలో పూజా హెగ్డే.. అబ్బాయి ఎవరో తెలిస్తే షాక్ అవడం ఖాయం..

రోహన్ మెహ్రాది ఉత్తరాంచల్. కేవలం రెండంటే రెండే బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. అవి కూడా అట్టర్ ఫ్లాప్. అయితే యాడ్స్‌లో మాత్రం బీభత్సంగానే నటించాడు. 200 కంటే ఎక్కువగానే యాడ్స్‌లో చేశాడు. అలాగే హిందీ బిగ్ బాస్ 10వ సీజన్‌లోనూ సెలబ్రిటీ కంటెస్టెంట్‌గా ప్రవేశించాడు. టాప్ 5లో నిలిచాడు. రోహన్ సినిమాల కంటే టీవీ సీరియల్ ద్వారానే ఎక్కువగా పాపులర్ అయ్యాడు. పూజా స్థాయితో పోలిస్తే రోహన్  చాలా సాధారణ వ్యక్తి. అతనితో ప్రేమాయణం నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. మరి ఈ వార్తలో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.