అరవయ్యేళ్ళ నాటి కల… వరికపూడిసెలకి రేపు జగన్ శంకుస్థాపన..

ఏపీ ప్రజానీకం ఎంతగానో ఎదురు చూస్తున్న వరికపూడిసెల ఎత్తిపోతల పథకానికి మహర్ధశ పట్టింది. ఇన్నేళ్లుగా కాగితాలకే పరిమితమైన కల ఇప్పుడు సాకారం అవుతోంది. పనులు ఎగ్గొట్టడానికి ఎన్నో దారులు ఉంటాయి. పని చేయాలంటే ఒక్కటే దారి ఉంటుంది. అది కష్టమైనా ఆ దారిలోనే వెళ్లి ఏపీ సీఎం జగన్ వరికపూడిసెల ఎత్తిపోతల పథకానికి రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించే ప్రదేశం టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం అనుమతులు నిరాకరించింది. దీంతో అప్పటి పాలకులు దీన్ని బూచిగా చూపి సైలెంట్ అయిపోపయారు. కానీ ఏపీ సీఎం జగన్ పుణ్యమాని ఇప్పుడు అది కార్యరూపం దాలుస్తోంది.

రూ. 340.26 కోట్లతో ఎత్తిపోతల పథకం తొలి దశ పనులు..

ఈ వరికపూడిసెల ఎత్తిపోతల పథకం తొలి దశ పనులను రూ. 340.26 కోట్లతో చేపట్టనున్నారు. దీనికి గానూ పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం వైఎస్ జగన్ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశ పనులను శరవేగంగా పూర్తి చేసిన అనంతరం అధునాతన పైప్ ఇరిగేషన్ ద్వారా 24,900 ఎకరాలకు నీళ్లు అందించనున్నారు. వాస్తవానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 40 కిలో మీటర్ల ఎగువన కృష్ణా నదిలో వరికపూడిసెల వాగు కలవడానికి ముందే.. ఆ వాగు నుంచి జలాలను ఎత్తి పోసి పల్నాడు భూములకు ఇవ్వాలన్నది ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదన. అయితే ఈ పనులు టైగర్ రిజర్వ్ ఫారెస్టులో చేపట్టడానికి కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో ఆ ప్రతిపాదన అక్కడితో ఆగిపోయింది.

24,900 ఎకరాలకు నీళ్లు..

వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి మళ్ళీ కదలిక వచ్చింది. దీంతో గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానంతో తొలి దశ పనులతో పాటు వరికపూడిసెల ఎత్తిపోతల తొలి దశ పనులను అధికారులు చేపట్టారు. వరికపూడిసెల వాగు కుడి గట్టున ఎత్తిపోతలను నిర్మించి తొలి దశలో రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున 1.57 టీఎంసీలను తరలించి వెల్దుర్తి మండలంలో 24,900 ఎకరాలకు నీళ్లందించే పనులను రూ.340.26 కోట్లతో చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 4 కి.మీ.ల పొడవున పైప్ లైన్ నిర్మాణానికి 19.13 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఈ అనుమతులు రావడం ఆలస్యమవడంతో ఇన్నాళ్ళుగా ఈ ప్రాజెక్టు ఆగింది.

ఏప్రిల్ 28న అనుమతి..

ఇప్పుడు ఆ ఫారెస్ట్ భూమికి ప్రతిగా దుర్గి మండలంలో 21 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు బదలాయించి పరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించింది. పలు మార్లు కేంద్రంతో రాష్ట్ర అధికారులు చర్చలు జరిపిన తరువాత వరికపూడిసెల ఎత్తిపోతలకు ఏప్రిల్ 28న అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఎత్తిపోతల ద్వారా వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగులకుంట, లోయపల్లి గ్రామాల పరిధిలో 24,900 ఎకరాలకు సరఫరా చేయడానికి వీలుగా పైప్ లైన్లు వేయనున్నారు. పైపులైన్ల ద్వారా నీటిని తరలించడం వల్ల సరఫరా నష్టాలు ఉండవని ఆయకట్టుకు సమర్ధవంతంగా నీటిని అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు సీఎం జగన్ మాచర్లలో పర్యటించనున్నారు. అక్కడ వరికపూడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన సభాస్థలి వద్ద ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు.

Sootiga Team

Recent Posts

‘Mr Bachchan’ has sizzling romance between lead pair

Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…

August 2, 2024

తెగ ట్రోలింగ్ అవుతోన్న కీర్తి

ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…

August 2, 2024

Congress to move privilege motion against PM Modi

The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…

July 31, 2024

మెడ్ ప్లస్ వివాదంలో శివజ్యోతి

బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…

July 31, 2024

తొడలు చూపిస్తోన్న కాంతార సుందరి

"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…

July 31, 2024

అది ఫేక్ అంటున్న అన్నపూర్ణ

ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…

July 31, 2024