అదిరిపోయే స్కెచ్… సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో సమావేశం కానున్న జగన్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో  ఎండాకాలాన్ని మించిన రాజకీయ వేడి రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఎవరికి వారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలని టీడీపీ కూటమి.. అధికారాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ హోరా హోరీ పోరు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ మరో ముందడుగు వేసింది. శత్రువు కంటే ముందుండాలంటే సోషల్ మీడియా, మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేయించుకోవాలి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌లను వాడుకోవాలని వైసీపీ భావిస్తోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పాత్ర ఇప్పుడు న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్లను మించి ఉంది. వీరు ఇప్పుడొక సెన్సేషన్.

23న భీమిలిలో సమావేశం..

ఇంటర్నెట్ యూజర్లను ఆకట్టుకోవడంలో వీరు దిట్ట. ఏదైనా విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పగలరు. ఈ సెన్సేషన్‌ను వాడుకుని జనం మెదళ్లలోకి పూర్తిగా వైసీపీని జొప్పించాలని పార్టీ ఆలోచన. వెంటనే దానిని అమల్లో పెట్టింది కూడా. అన్ని వర్గాలనూ ప్రభావింతం చేయగలిగే సత్తా ఉన్న ఇన్‌ఫ్లూయన్సర్ల సాయంతో రాజకీయాలను పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలని వైసీపీ భావిస్తోంది.  దీనిలో భాగంగానే ఇన్‌ఫ్లూయెన్సర్లను రంగంలోకి దింపాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 23న భీమిలిలో ఇన్‌ఫ్లూయెన్సర్లతో సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కూడా హాజరుకానున్నారు.

అదిరిపోయే స్కెచ్ వేసిన వైసీపీ..

ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్నవారు హాజరుకానున్నారు. వీరందరినీ ఉద్దేశించి జగన్ ప్రసంగించనున్నారు. ఎన్నికలకు 20 రోజులే సమయం ఉంది. దీనిని చక్కగా వినియోగించుకోవాలని వైసీపీ భావిస్తోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల ద్వారా జగన్ పాలనలో సాధించిన విజయాలు.. సంక్షేమ పథకాలు, ప్రజలకు దక్కిన రాజకీయ, సామాజిక ప్రయోజనం వంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎలా కృషి చేయాలో జగన్ వివరించనున్నారు. అలాగే టీడీపీ, దాని అనుబంధ మీడియా చేసే దుష్ప్రచారం మాయలో ప్రజలు పడకుండా చూసుకునేందుకు సైతం సలహాలివ్వనున్నారు. మొత్తానికి వైసీపీ అదిరిపోయే స్కెచ్ వేసిందనే చెప్పాలి.

Sootiga Team

Recent Posts

RTV ఆఫీసుపై ఈడీ దాడులు!!

RTV ఛానల్ ఆది నుంచి చిక్కుల్లోనే మునిగి తేలుతోంది..! ఇప్పటికే ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్న ఈ ఛానల్ ఏపీ, తెలంగాణ…

June 29, 2024

విజయ్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారే!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకున్నా, అది కూడా…

June 29, 2024

చిప్ప కూడు తింటున్నా.. పవిత్ర పొగరు తగ్గలేదే..!

కన్నడ హీరో దర్శన్.. ఆయన లవర్ పవిత్ర ఇద్దరూ హత్య కేసులో ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే. ఐతే…

June 29, 2024

బాబోయ్.. ‘కల్కి’ మూవీకి తొలిరోజే ఇన్ని కోట్లా..?

టాలీవుడ్ నుంచి సరైన సినిమా వచ్చి కొన్ని నెలలు గడుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే గుంటూరు కారం తర్వాత అంత పెద్ద…

June 28, 2024

Kalki 2898AD Review: ప్రభాస్ కల్కి మూవీ రివ్యూ.. పోలా ఆదిరిపోలా!

అవును..'కల్కి' న భూతో.. న భవిష్యత్.. రోమాలు నిక్కపొడిచే సన్నివేశాల చిత్రం! ప్రపంచ ఖ్యాతి అర్హత ఉన్న ప్రశంస వర్షాల…

June 27, 2024

కల్కి రిలీజ్ ముందు అదిరిపోయే అప్డేట్..!

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకుడిగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో తెరకెక్కిన సినిమా కల్కి. మరికొన్ని గంటల్లో…

June 26, 2024