అదిరిపోయే స్కెచ్… సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో సమావేశం కానున్న జగన్

అదిరిపోయే స్కెచ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో సమావేశం కానున్న జగన్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో  ఎండాకాలాన్ని మించిన రాజకీయ వేడి రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఎవరికి వారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలని టీడీపీ కూటమి.. అధికారాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ హోరా హోరీ పోరు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ మరో ముందడుగు వేసింది. శత్రువు కంటే ముందుండాలంటే సోషల్ మీడియా, మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేయించుకోవాలి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌లను వాడుకోవాలని వైసీపీ భావిస్తోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పాత్ర ఇప్పుడు న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్లను మించి ఉంది. వీరు ఇప్పుడొక సెన్సేషన్.

23న భీమిలిలో సమావేశం..

ఇంటర్నెట్ యూజర్లను ఆకట్టుకోవడంలో వీరు దిట్ట. ఏదైనా విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పగలరు. ఈ సెన్సేషన్‌ను వాడుకుని జనం మెదళ్లలోకి పూర్తిగా వైసీపీని జొప్పించాలని పార్టీ ఆలోచన. వెంటనే దానిని అమల్లో పెట్టింది కూడా. అన్ని వర్గాలనూ ప్రభావింతం చేయగలిగే సత్తా ఉన్న ఇన్‌ఫ్లూయన్సర్ల సాయంతో రాజకీయాలను పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలని వైసీపీ భావిస్తోంది. దీనిలో భాగంగానే ఇన్‌ఫ్లూయెన్సర్లను రంగంలోకి దింపాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 23న భీమిలిలో ఇన్‌ఫ్లూయెన్సర్లతో సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కూడా హాజరుకానున్నారు.

అదిరిపోయే స్కెచ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో సమావేశం కానున్న జగన్

అదిరిపోయే స్కెచ్ వేసిన వైసీపీ..

ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్నవారు హాజరుకానున్నారు. వీరందరినీ ఉద్దేశించి జగన్ ప్రసంగించనున్నారు. ఎన్నికలకు 20 రోజులే సమయం ఉంది. దీనిని చక్కగా వినియోగించుకోవాలని వైసీపీ భావిస్తోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల ద్వారా జగన్ పాలనలో సాధించిన విజయాలు.. సంక్షేమ పథకాలు, ప్రజలకు దక్కిన రాజకీయ, సామాజిక ప్రయోజనం వంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎలా కృషి చేయాలో జగన్ వివరించనున్నారు. అలాగే టీడీపీ, దాని అనుబంధ మీడియా చేసే దుష్ప్రచారం మాయలో ప్రజలు పడకుండా చూసుకునేందుకు సైతం సలహాలివ్వనున్నారు. మొత్తానికి వైసీపీ అదిరిపోయే స్కెచ్ వేసిందనే చెప్పాలి.

Google News