వైరల్ వీడియో… 147 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందంటున్న టీడీపీ

వైరల్ వీడియో… 147 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందంటున్న టీడీపీ

అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే వైసీపీ 147 స్థానాల్లో విజయడంఖా మోగిస్తోంది. ఇప్పటి వరకూ ప్రముఖ సర్వే, మీడియా సంస్థలు సర్వేల్లో ఫ్యాన్ ప్రభంజనమేనని తేల్చేశాయి. ఇప్పుడు ఏకంగా టీడీపీ చేసిన సర్వేలోనే వైసీపీ గెలుస్తుందని తేలడం ఆశ్చర్యంగా ఉంది. ఈ సర్వే చూసిన తెలుగు తమ్ముళ్లు నిర్ఘాంతపోయారు. 147 నియోజకవర్గాల్లో వైసీపీ ముందంజలో ఉందన్న వీడియో కూడా లీక్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది. టీడీపీ ఇంటర్నల్ మీటింగ్‌లో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా టీడీపీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ పార్టీ నేతలకు దిశానిద్దేశం చేశారు. ఈ వీడియో ఎలా లీకయ్యిందో తెలియట్లేదు కానీ ఇప్పుడు నెట్టింట్లో ఇదే చర్చ.. అంతకుమించి రచ్చ.

ఒకటా.. రెండా.. ఎన్నో.. ఎన్నెన్నో!!

వాస్తవానికి.. ఫ్యాన్ యమా స్పీడ్ మీద దూసుకుపోతోందన్నది జగమెరిగిన సత్యమే. సీట్లు ప్రకటన దగ్గర నుంచి సిద్ధం, మేమంతా సభల వరకూ వైసీపీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ముందుగానే అభ్యర్ధులను ప్రకటించి ప్రతిపక్షాలకు వైసీపీ ఊహించని షాక్ ఇచ్చింది. అలాగే.. ‘సామాజిక బస్ యాత్ర’, ‘వై ఎపీ నీడ్స్ జగన్’, ‘ఆడుదాం ఆంధ్రా’ వంటి కార్యక్రమాలు నిర్వహించి నిత్యం ప్రజలతో మమేకమైంది. రాష్ట్రంలో నాలుగు చోట్ల నిర్వహించిన ‘సిద్ధం’ సభలతో ఒక్కసారిగా ట్రెండ్ మారిపోయింది. వైసీపీ గెలుపు ఖాయమని తెలిపోయింది. ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారని క్లియర్ కట్‌గా అందరికీ అర్ధమైంది. దీనికి తోడు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు ప్రజల నుండి అంతంతమాత్రంగా స్పందన రావడంతో క్యాడర్‌లో టీడీపీలో నిరుత్సాహం మొదలైంది. 

వైరల్ వీడియో… 147 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందంటున్న టీడీపీ

లెక్క తేలట్లేదు!

దీనికి తోడు.. టీడీపీ, జనసేన మద్య పొత్తు అస్సలు పొసగలేదు. సీట్లు సర్ధుబాట్లలో చిచ్చు చెలరేగింది. క్షేత్ర స్థాయిలో క్యాడర్‌లో సమన్వయం కొరవడింది. కూటమిలో తిరుగుబాటు బావుటా మొదలైంది. సర్వేలు కూడా వైసీపీకి వస్తాయని తేలడంతో టీడీపీ ఆశలు ఆవిరైపోయాయి. టీడీపీ, జనసేన మద్య సీట్ల షేరింగ్‌లో చాలా చోట్ల విభేదాలు తలెత్తాయి. దీంతో సీట్ల ప్రకటనలో విపరీతమైన జాప్యం ఏర్పడింది. ఇప్పటికీ ఇంకా నాలుగైదు స్థానాల్లో అభ్యర్థులను మార్చేందుకు సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు.. నలుగురు టీడీపీ నేతలు రెబల్స్‌గా మారి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు కూడా దాఖలు చేశారు. సరిగ్గా ఇదేటైమ్‌లో వైసీపీ గెలుస్తోందని టీడీపీ సర్వే చేసిన వీడియో బయటికి రావడంతో రచ్చ రచ్చ అవుతోంది. ఈ వీడియోను జనాలు చూసి ఇదంతా ముందే తెలిసిందేగా.. ఇప్పుడు అధికారికంగా టీడీపీ ఇలా చెబుతోందంటూ లెక్కలేసుకుంటున్నారు. ఈ వీడియో వ్యవహారంపై టీడీపీ ఎలా డిఫెండ్ చేసుకుంటుందో చూడాలి మరి.

Google News