టీడీపీలో ఓటమి భయం.. లోకేష్‌లో వణుకు!

ఓటమి భయం కొందరిని దేనికైనా దిగజార్చేలా చేస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఓటమిని తీసుకోవడం అందరి వల్లా కాదు. న్యాయంగా పోరాడలేక హింసను నమ్ముకోవడం ఇక్కడ అలవాటే. రాజకీయాల్లో గెలుపోటములే పరమావధి. ధర్మంగా గెలవలేమని భావిస్తే కేడర్‌ను రెచ్చగొట్టి అవతలి వాళ్ల మీద దాడులకు ఉసిగొల్పి రక్తపాతానికి కుట్రలు పన్నుతారు.  2019 ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరిగి మంగళగిరి నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈసారి కూడా కష్టమేనని, ఎన్నికల ముందే ఓడిపోయారనే భావన వైసీపీకి వస్తున్న ఆదరణ, నియోజకవర్గంలో ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.

లోకేష్‌లో వణుకు!

సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సర్వేలు చేయించి పక్కాగా గెలుస్తారని భావించిన బీసీ అభ్యర్థి లావణ్యను బరిలోకి దింపారు. దీంతో నారా లోకేష్‌లో ఓటమి భయం పట్టుకుంది. దీంతో ప్రజాస్వామాయబద్ధంగా ఎన్నికలకు వెళ్తే గెలిచేది లేదని అర్థం చేసుకున్న నారా లోకేష్ ఏకంగా హింసకు తెరదీశారు. ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి సీఎస్ఆర్ కళ్యాణ మండపం రోడ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ కార్యకర్త మేకా వెంకట్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చుట్టూ బైకులతో రౌండ్లు వేస్తూ భయభ్రాంతులను గురిచేశారు.

టీడీపీ ఓటమి భయం.. లోకేష్‌లో వణుకు!

ప్రశ్నించినందుకు..

ఏమిటీ రౌడీయిజం అని ప్రశ్నించినందుకు మేకా వెంకట్ రెడ్డిని టీడీపీ కార్యకర్తలు బైక్‌తో గుద్ది వెళ్ళియారు. ఈ ఘటనలో వెంకటరెడ్డి తలకు బలమైన గాయం అయ్యింది. వెంటనే వెంట ఉన్న వైసీపీ కార్యకర్తలు ఆయన్ను చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మేకా వెంకటరెడ్డి మృతి చెందారు. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలోని ప్రజానీకం భయబ్రాంతులకు గురవుతోంది. మున్ముందు ఈ టీడీపీ గూండాలు ఇంకెన్ని అరాచకాలు చేస్తారో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఓటమి భయం… ఏమి చేయాలో తెలియని ఫ్రస్ట్రేషన్… లోకేష్ ను ఇలా హింసకు పురిగొల్పుతోందని అక్కడి వారు భావిస్తున్నారు.