టీడీపీ రౌడీ రాజకీయం.. దాడిలో వైసీపీ కార్యకర్త బలి

టీడీపీ రౌడీ రాజకీయం.. దాడిలో వైసీపీ కార్యకర్త బలి

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన పార్టీలన్నింటిలో టెన్షన్ పెరిగిపోతోంది. నయానో భయానో ఓటర్లను లొంగదీసుకునేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఓటర్లనే కాదు.. అధికార పార్టీ కార్యకర్తలను సైతం ఏదో ఒక విధంగా లొంగదీసుకునేందుకు చివరకు హత్యా యత్నాలకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా పచ్చ గూండాల దాడిలో వైసీపీ కార్యకర్త ఒకరు బలయ్యారు. ఆసుపత్రిలో నిస్తేజంగా పడి ఉన్నాడు. టీడీపీ గూండాలు చేసిన పనికి సదరు కార్యకర్త కుటుంబం తల్లడిల్లుతోంది. 

మంగళగిరిలో ఓటమి తప్పదని తెలిసి.. వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై తన గూండాలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పొలిటికల్ టెర్రరిస్ట్‌లా దాడులు చేయిస్తున్నారు. నిన్న రాత్రి ప్రచారంలో ఉన్న మేకా వెంకటరెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేశారు. అతడిని తీవ్రంగా గాయపరచడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యులు వెంకటరెడ్డికి చికిత్సను అందిస్తున్నారు. వెంకటరెడ్డికి బ్రెయిన్ డెడ్ అయినట్టుగా తెలుస్తోంది.

టీడీపీ రౌడీ రాజకీయం.. దాడిలో వైసీపీ కార్యకర్త బలి

మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి రూరల్‌ మండలం కుంచనపల్లిలోని సీఎస్‌ఆర్‌ రోడ్‌లో వైసీపీ నేతలు గురువారం రాత్రి ప్రచారం చేస్తున్నారు. వారిని మద్యం మత్తులో ఉన్న  టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇక్కడ ప్రచారం నిర్వహించొద్దంటూ వాగ్వాదానికి దిగారు. టీడీపీతో పాటు లోకేష్‌కు అనుకూల నినాదాలు చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ గూండాలు దాడికి దిగారు. ఈ దాడిలో ముగ్గురు గాయపడగా.. వెంకటరెడ్డి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.