జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరి రామ జోగయ్య ఘాటు లేఖ రాశారు. చంద్రబాబును గద్దెనెక్కించడానికి కాపులు సిద్ధంగా లేరని.. చంద్రబాబును గెలిపించడం కోసం పవన్ వెంట కాపులు నడవడం లేదన్నారు. సీట్లు సాధించలేని వాడివి రేపు రాష్ట్ర ప్రయోజనాలు ఏరకంగా కాపాడతావని హరిరామ జోగయ్య ప్రశ్నించారు. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారని నిలదీశారు. చంద్రబాబును సీఎంను చేయడం కోసం పవన్ వెంట కాపులు నడవాలా? అని ప్రశ్నించారు. రెండున్నరేళ్లు పవన్ సీఎంగా ఉంటారనే మాట చంద్రబాబుతో చెప్పించి తీరాలని లేఖలో హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు.
జనసేన సపోర్ట్ లేకుంటే టీడీపీకి కష్టమే..
అసలు సీట్లు సాధించలేని వాడివి రేపు రాష్ట్ర ప్రయోజనాలు ఏరకంగా కాపాడతావు అని ప్రశ్నించారు. జనసేనకు 27 నుంచి 30 సీట్లు వస్తాయని ఏకపక్షమైన ఎల్లో మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు. అలాంటి వార్తలు చూస్తుంటే ఎవరిని ఉద్ధరించడానికని పొత్తు అని హరిరామ జోగయ్య ప్రశ్నించారు. పార్టీ శ్రేణులంతా ఈ విషయాన్ని గ్రహించాలన్నారు. వైసీపీని రాజ్యాధికారం నుంచి తప్పించడమంటే టీడీపీకి రాజ్యాధికారం కట్టబెట్టడం కాదన్నారు. అసలు కాపు సామాజిక వర్గం పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రయాణం చేస్తున్నది ఈ ఆలోచనతో కాదనే విషయాన్ని గుర్తించాలని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. జనసేన సపోర్ట్ లేకుండా టీడీపీ అధికారంలోకి రావడం కష్టమన్నారు. దీనికి 2019 ఫలితాలే ఉదాహరణ అని హరిరామ జోగయ్య పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలు ఎలా సాధ్యం?
175 సీట్లు ఉన్న రాష్ట్రంలో జనసేన కనీసం 50 సీట్లలోనైనా పోటీ చేసే అవకాశం దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందనే నమ్మకం వస్తుందని హరి రామ జోగయ్య తెలిపారు. కాబట్టి తప్పకుండా 40 నుంచి 60 సీట్లలో పోటీ చేసి తీరాలన్నారు. అధికారం అంతా చంద్రబాబుకే ధారపోస్తే మీరు కలలు కంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా సాధ్యమవుతాయంటూ పవన్ కల్యాణ్‌ను హరిరామ జోగయ్య సూటిగా ప్రశ్నించారు. జన సైనికులు సంతృప్తి పడేలా సీట్ల పంపకం జరగకపోయినా.. ముఖ్యమంత్రి పదవి రెండున్నర సంవత్సరాలైనా కట్టబెడతానని చంద్రబాబు ఎన్నికల ముందే ప్రకటించగలుగుతారా? అని జోగయ్య లేఖ ద్వారా పవన్ కల్యాణ్‌ను నిలదీశారు.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…