చంద్రబాబును గద్దెనెక్కించడానికి కాపులు సిద్ధంగా లేరు… పవన్‌కు హరిరామ జోగయ్య ఘాటు లేఖ

చంద్రబాబును గద్దెనెక్కించడానికి కాపులు సిద్ధంగా లేరు... పవన్‌కు హరిరామ జోగయ్య ఘాటు లేఖ

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరి రామ జోగయ్య ఘాటు లేఖ రాశారు. చంద్రబాబును గద్దెనెక్కించడానికి కాపులు సిద్ధంగా లేరని.. చంద్రబాబును గెలిపించడం కోసం పవన్ వెంట కాపులు నడవడం లేదన్నారు. సీట్లు సాధించలేని వాడివి రేపు రాష్ట్ర ప్రయోజనాలు ఏరకంగా కాపాడతావని హరిరామ జోగయ్య ప్రశ్నించారు. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారని నిలదీశారు. చంద్రబాబును సీఎంను చేయడం కోసం పవన్ వెంట కాపులు నడవాలా? అని ప్రశ్నించారు. రెండున్నరేళ్లు పవన్‌ సీఎంగా ఉంటారనే మాట చంద్రబాబుతో చెప్పించి తీరాలని లేఖలో హరిరామ జోగయ్య డిమాండ్‌ చేశారు.

జనసేన సపోర్ట్ లేకుంటే టీడీపీకి కష్టమే..

Advertisement

అసలు సీట్లు సాధించలేని వాడివి రేపు రాష్ట్ర ప్రయోజనాలు ఏరకంగా కాపాడతావు అని ప్రశ్నించారు. జనసేనకు 27 నుంచి 30 సీట్లు వస్తాయని ఏకపక్షమైన ఎల్లో మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు. అలాంటి వార్తలు చూస్తుంటే ఎవరిని ఉద్ధరించడానికని పొత్తు అని హరిరామ జోగయ్య ప్రశ్నించారు. పార్టీ శ్రేణులంతా ఈ విషయాన్ని గ్రహించాలన్నారు. వైసీపీని రాజ్యాధికారం నుంచి తప్పించడమంటే టీడీపీకి రాజ్యాధికారం కట్టబెట్టడం కాదన్నారు. అసలు కాపు సామాజిక వర్గం పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రయాణం చేస్తున్నది ఈ ఆలోచనతో కాదనే విషయాన్ని గుర్తించాలని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. జనసేన సపోర్ట్ లేకుండా టీడీపీ అధికారంలోకి రావడం కష్టమన్నారు. దీనికి 2019 ఫలితాలే ఉదాహరణ అని హరిరామ జోగయ్య పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలు ఎలా సాధ్యం?

175 సీట్లు ఉన్న రాష్ట్రంలో జనసేన కనీసం 50 సీట్లలోనైనా పోటీ చేసే అవకాశం దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందనే నమ్మకం వస్తుందని హరి రామ జోగయ్య తెలిపారు. కాబట్టి తప్పకుండా 40 నుంచి 60 సీట్లలో పోటీ చేసి తీరాలన్నారు. అధికారం అంతా చంద్రబాబుకే ధారపోస్తే మీరు కలలు కంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా సాధ్యమవుతాయంటూ పవన్ కల్యాణ్‌ను హరిరామ జోగయ్య సూటిగా ప్రశ్నించారు. జన సైనికులు సంతృప్తి పడేలా సీట్ల పంపకం జరగకపోయినా.. ముఖ్యమంత్రి పదవి రెండున్నర సంవత్సరాలైనా కట్టబెడతానని చంద్రబాబు ఎన్నికల ముందే ప్రకటించగలుగుతారా? అని జోగయ్య లేఖ ద్వారా పవన్ కల్యాణ్‌ను నిలదీశారు.

చంద్రబాబును గద్దెనెక్కించడానికి కాపులు సిద్ధంగా లేరు... పవన్‌కు హరిరామ జోగయ్య ఘాటు లేఖ