సర్వే ఏదైనా చెప్పేదొక్కటే.. ఈసారి కూడా వైసీపీదే విజయం..!

సర్వేలన్నీ గంపగుత్తిగా ఈ సారి ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీదే విజయమని చెబుతున్నాయి. గతంలో టైమ్స్ నౌ, పొలిటికల్ క్రిటిక్, పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేలు ఏదైతే చెప్పాయో తాజాగా మరో సర్వే సంస్థ కూడా అదే చెప్పింది. జన్‌మత్ పోల్స్ తాజా సర్వేలో వైసీపీకి 116 నుంచి 118 స్థానాలు వస్తాయని తేల్చింది. గత ఎన్నికలతో పోలిస్తే స్థానాలు కాస్తో కూస్తో తగ్గినా కూడా వైసీపీ విజయఢంకా మోగించడం ఖాయమని చెబుతోంది. ప్రజల మద్దతు ఈసారి కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికేనని జనమత్ సంస్థ తేల్చింది.

టీడీపీ, జనసేనలకు కేవలం 46 సీట్లే..

Advertisement

పేదలకు సంక్షేమాన్ని చేరువ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తున్న జగనన్న ప్రభుత్వానికి ప్రజలు కట్టుబడి ఉన్నారని జన్‌మత్ పోల్స్  సంస్థ తేల్చింది. ఇక కూటమి కట్టి మరీ ఈసారి ఎన్నికలకు వెళుతున్న టీడీపీ, జనసేనలకు కేవలం 46 నుంచి 48 సీట్లు మాత్రమే దక్కుతాయని తేల్చి చెప్పింది. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో సైతం ఈ సంస్థ చేసిన సర్వే అక్షరాలా నిజమైంది. ఏపీలో కూడా పక్కాగా నిజమవుతుందని అంతా భావిస్తున్నారు.   

మరోవైపు దేశంలోనే పేరొందిన టైమ్స్ నౌ గ్రూప్-ఈటీజీ గ్రూప్ సర్వేల్లోనూ తేలిందిదే. ఏపీలో 51 శాతం ప్రజలు వైయస్‌ఆర్‌సీపీకే జై కొడతారని స్పష్టమైంది.

జగనన్నతోనే జనం..

టైమ్స్ నౌ-ఈటీజీ సంస్థలకు సర్వేల పరంగా చాలా అనుభవం ఉంది. దేశవ్యాప్తంగా అనేక ఎన్నికల్లో ఈ సంస్థలు వెల్లడించిన సర్వేలకు అనుగుణంగా ఫలితాలు వెలువడ్డాయి. ఇక పొలిటికల్‌ క్రిటిక్‌ సర్వేస్‌ అండ్‌ అనాలసిస్‌ సంస్థ ఇటీవల వెల్లడించిన సర్వేలోనూ వైయస్సార్‌సీపీకి 135 వరకు వస్తాయని చెప్పిన విషయం తెలిసిందే. పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేలో వైసీపీకి 48.5శాతం, టీడీపీకి కేవలం 38.2 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. మొత్తమ్మీద సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల కారణంగా జనం బాగా లబ్ది పొందారు. దీంతో వారంతా ఈసారి కూడా జగనన్న ప్రభుత్వానికి అండగా నిలవాలని భావిస్తున్నారు. టీడీపీ, జనసేన కలిసినా కూడా వైసీపీని కొట్టడం కష్టమేనని సర్వేలు చెబుతున్నాయి.

Advertisement
Sootiga Team

Recent Posts

వావ్.. క్రేజ్ కా బాప్.. మిలియన్స్ దాటిన జగన్ ఇంటర్వ్యూ వ్యూస్!

సచిన్ టెండూల్కర్ స్టేడియంలో పాక్‌ బౌలర్స్‌ను ఒకాట ఆడుకుంటే ఎలా ఉంటుంది? అసలు భారత్, పాక్ మ్యాచే హోరెత్తించేదైతే.. ఇక…

May 9, 2024

పిఠాపురంలో వాలిపోయిన టాలీవుడ్.. పవన్‌ను గెలిపిస్తారా?

గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు ప్రాంతాల్లో పోటీ చేసి రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. ఈసారి…

May 9, 2024

కెరీర్ బాగుండాలంటే కోరిక తీర్చాల్సిందే: కుండబద్దలు కొట్టిన రమ్యకృష్ణ

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనేది ఓపెన్ సీక్రెటే. ఎప్పటి నుంచో చాలా మంది నటీమణులు ఈ విషయాన్ని వెల్లడించారు.…

May 9, 2024

పవన్‌ కోసం రంగంలోకి చిరు.. గెలుస్తాడా..!?

అవును.. తమ్ముడు కోసం అన్నయ్య రంగంలోకి దిగిపోయారు. తమ్ముడికి అవసరమైతే తప్పక సపోర్ట్ చేస్తానని గతంలో ఓ సందర్భంలో మెగాస్టార్…

May 9, 2024

రామ్ చరణ్‌కు ఆ హీరోతో పోలికేంటి? అసలెలా?

ఇండస్ట్రీలో సక్సెస్ అయితే తప్ప గుర్తింపు రాదు. స్టార్ హీరో కొడుకైనా.. సామాన్యుడి కొడుకైనా అక్కడ ఒక్కటే. స్టార్ హీరో…

May 9, 2024

మహిళలపై టీడీపీ వరుసదాడులు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో ఓడిపోతామనే భయం కలిగిన పార్టీలు, నేతలు తమ…

May 8, 2024