సర్వే ఏదైనా చెప్పేదొక్కటే.. ఈసారి కూడా వైసీపీదే విజయం..!

సర్వే ఏదైనా చెప్పేదొక్కటే.. ఈసారి కూడా వైసీపీదే విజయం..!

సర్వేలన్నీ గంపగుత్తిగా ఈ సారి ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీదే విజయమని చెబుతున్నాయి. గతంలో టైమ్స్ నౌ, పొలిటికల్ క్రిటిక్, పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేలు ఏదైతే చెప్పాయో తాజాగా మరో సర్వే సంస్థ కూడా అదే చెప్పింది. జన్‌మత్ పోల్స్ తాజా సర్వేలో వైసీపీకి 116 నుంచి 118 స్థానాలు వస్తాయని తేల్చింది. గత ఎన్నికలతో పోలిస్తే స్థానాలు కాస్తో కూస్తో తగ్గినా కూడా వైసీపీ విజయఢంకా మోగించడం ఖాయమని చెబుతోంది. ప్రజల మద్దతు ఈసారి కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికేనని జనమత్ సంస్థ తేల్చింది.

టీడీపీ, జనసేనలకు కేవలం 46 సీట్లే..

Advertisement

పేదలకు సంక్షేమాన్ని చేరువ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తున్న జగనన్న ప్రభుత్వానికి ప్రజలు కట్టుబడి ఉన్నారని జన్‌మత్ పోల్స్ సంస్థ తేల్చింది. ఇక కూటమి కట్టి మరీ ఈసారి ఎన్నికలకు వెళుతున్న టీడీపీ, జనసేనలకు కేవలం 46 నుంచి 48 సీట్లు మాత్రమే దక్కుతాయని తేల్చి చెప్పింది. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో సైతం ఈ సంస్థ చేసిన సర్వే అక్షరాలా నిజమైంది. ఏపీలో కూడా పక్కాగా నిజమవుతుందని అంతా భావిస్తున్నారు.

సర్వే ఏదైనా చెప్పేదొక్కటే.. ఈసారి కూడా వైసీపీదే విజయం..!

మరోవైపు దేశంలోనే పేరొందిన టైమ్స్ నౌ గ్రూప్-ఈటీజీ గ్రూప్ సర్వేల్లోనూ తేలిందిదే. ఏపీలో 51 శాతం ప్రజలు వైయస్‌ఆర్‌సీపీకే జై కొడతారని స్పష్టమైంది.

జగనన్నతోనే జనం..

టైమ్స్ నౌ-ఈటీజీ సంస్థలకు సర్వేల పరంగా చాలా అనుభవం ఉంది. దేశవ్యాప్తంగా అనేక ఎన్నికల్లో ఈ సంస్థలు వెల్లడించిన సర్వేలకు అనుగుణంగా ఫలితాలు వెలువడ్డాయి. ఇక పొలిటికల్‌ క్రిటిక్‌ సర్వేస్‌ అండ్‌ అనాలసిస్‌ సంస్థ ఇటీవల వెల్లడించిన సర్వేలోనూ వైయస్సార్‌సీపీకి 135 వరకు వస్తాయని చెప్పిన విషయం తెలిసిందే. పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేలో వైసీపీకి 48.5శాతం, టీడీపీకి కేవలం 38.2 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. మొత్తమ్మీద సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల కారణంగా జనం బాగా లబ్ది పొందారు. దీంతో వారంతా ఈసారి కూడా జగనన్న ప్రభుత్వానికి అండగా నిలవాలని భావిస్తున్నారు. టీడీపీ, జనసేన కలిసినా కూడా వైసీపీని కొట్టడం కష్టమేనని సర్వేలు చెబుతున్నాయి.