డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయ్ కాంత్ ఇక లేరు..

డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయ్ కాంత్ ఇక లేరు..

డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయ్ కాంత్ మృతి చెందారు. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్యశాఖ సెక్రటరీ అధికారికంగా ప్రకటించారు. కొద్ది రోజులుగా విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం కూడా ఆయన అనారోగ్యం పాలవగా.. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను మియాట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే ఆయన మృతి చెందారు.

విజయ్ కాంత్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. విజయ్ కాంత్ 1952 ఆగస్ట్ 25న జన్మించారు. ఆయన ‘ఇనిక్కుం ఇలామై’ అనే సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి వందకు పైగా సినిమాలు చేసి తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ‘ఇనిక్కుం ఇలామై’తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. విజయకాంత్‌ నటించిన 100వ చిత్రం ‘కెప్టెన్‌ ప్రభాకర్‌’. ఈ సినిమా సక్సెస్‌తో ఆయన కెప్టెన్‌గా పిలవడం ఆరంభించారు.

డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయ్ కాంత్ ఇక లేరు..

విజయ్ కాంత్ నటించిన చిత్రాలు తెలుగులో కూడా డబ్ అవడంతో ఆయనకు టాలీవుడ్‌లో సైతం అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఆ తరువాత రాజకీయాల దిశగా తన ప్రస్థానం సాగించారు. 2005 సెప్టెంబర్ 14న డీఎండీకే పార్టీని విజయ్ కాంత్ స్థాపించారు. 2006లో తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2011లో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. విజయ్ కాంత్ మృతి పట్ల ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Google News