కేసీఆర్ వాహనాలను కొన్నారన్న రేవంత్.. బీఆర్ఎస్ కౌంటర్..!

కేసీఆర్ వాహనాలను కొన్నారన్న రేవంత్.. బీఆర్ఎస్ కౌంటర్..!

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ సీఎం తానే అవుతానని కొత్త కాన్వాయ్‌ను కేసీఆర్ సిద్ధం చేసుకున్నారట. రూ.3 కోట్ల చొప్పున వెచ్చించి 22 ల్యాండ్ క్రూయిజర్ వాహనాలకు కొనుగోలు చేశారట. వాటిని విజయవాడలో దాచి పెట్టారంటూ సీఎం రేవంత్ వెల్లడించారు. తాను తిరిగి ముఖ్యమంత్రి అయితే తనతో పాటు తన కుటుంబ సభ్యులు ఆ వాహనాల్లో తిరగొచ్చని కేసీఆర్ భావించారట.

అయితే తాను తన కాన్వాయ్ కోసం కొత్తది ఎందుకు కొనడం.. పాతదాన్నే మరమ్మతులు చేయించుకుంటే పోలా? అని అనుకుని అధికారులకు చెప్పారట. ఆ సమయంలోనే ఓ అధికారి కేసీఆర్ 22 ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొని విజయవాడలో దాచిన విషయాన్ని బయటపెట్టారన్నారు. రేవంత్ వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. అసలెందుకు కేసీఆర్ తన వద్ద వాహనాలుండగా.. కొత్త కాన్వాయ్‌ను అది కూడా పెద్ద ఎత్తున డబ్బు వెచ్చించి కొన్నారంటూ చర్చలు జరుగుతున్నాయి.

Advertisement

రేవంత్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ వినియోగిస్తున్న 10 ఫార్ట్యూన్‌ వాహనాలకు మరికొన్ని జతయ్యాయన్నారు. ఈ క్రమంలోనే కొన్ని ల్యాండ్ క్రూయిజ్ వాహనాలు హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరగా.. వాటిని విజయవాడలోని ఓ వర్క్ షాపుకు తరలించినట్టు వెల్లడించారు. అక్కడ వాటన్నింటినీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చే ప్రక్రియ కొనసాగుతోందంని క్రిశాంక్ తెలిపారు. అలాగే కేసీఆర్ మరో రెండు బస్సులను సైతం బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తున్నారంటూ వెటకారంగా తెలిపారు.