తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ నేడు రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించారు. ఒక్కసారిగా ఆమె రాజీనామా చేసినట్టు వార్త గుప్పునమడంతో తెలంగాణలో సంచలనంగా మారింది. అసలు ఎందుకు ఆమె రాజీనామా చేశారు? తెలంగాణలో బీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అన్నప్పుడు కూడా తమిళిసై రాజీనామా ఆలోచన చేయలేదు. మరి ఇప్పుడెందుకు ఆమె రాజీనామా చేసినట్టు? అంటే దీనికి కారణం లేకపోలేదు.
తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె చీఫ్‌గా వ్యవహరించినటువంటి తమిళనాడు నుంచే లోక్‌సభకు బీజేపీ తరుఫున పోటీ చేయాలని భావిస్తున్నారు. అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తమిళిసై తన గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం రాజీనామా చేశారు. 2019లో తెలంగాణ రాష్ట్రానికి తమిళిసై గవర్నర్‌గా నియమితులయ్యారు. తెలంగాణకుక తొలి మహిళ గవర్నర్ సైతం ఆమే కావడం విశేషం.
ప్రజాదర్బార్, ఫిర్యాదు బాక్స్ వంటివి పెట్టిన తొలి గవర్నర్ తమిళిసైయే కావడం మరో విశేషమని చెప్పవచ్చు. ముఖ్యంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పెద్ద ఎత్తున వార్‌కు దిగారు. ఏమాత్రం వెనుకాడుగు వేయకుండా ఢీ అంటే ఢీ అన్నారు. తెలంగాణ గవర్నర్‌గా రావడానికి పూర్వం తమిళిసై తమిళనాడు బీజేపీ చీఫ్‌గా వ్యవహరించారు. ఇప్పుడు అక్కడి నుంచే లోక్‌సభ బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా తిరునల్వేలి, కన్యాకుమారిలో ఆమె సొంత సామాజికవర్గమైన నాడార్లు ఎక్కువ. కాబట్టి అక్కడి నుంచి పోటీ చేయవచ్చని సమాచారం.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…