ఏపీలో రంజుగా రాజకీయం.. గెలిచేదెవరు? ఓడేదెవరు?

ఓటమిని ఎదుర్కొని నిలదొక్కుకోవడమంటే సామాన్య విషయం కాదు. గతంలో ప్రజారాజ్యం పార్టీ 30కి పైగా స్థానాల్లో విజయం సాధించి కూడా డీలా పడింది. అధికారంలోకి రాలేమని భావించిందో మరొకటో కానీ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ప్రజారాజ్యంతో పోలిస్తే జనసేన పార్టీ ఒకే ఒక్క సీటు సాధించింది. ఏపీలో రెండు చోట్ల పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్కచోట కూడా విజయం సాధించలేకపోయారు.

అయినా సరే.. పవన్ వెనుకడుగు వేయలేదు. నిత్యం రాజకీయాల్లోనే ఉన్నారు. ప్రజల పక్షాన పోరాడారు. ఓటమి వేదన లేదని కాదు కానీ దాన్ని అధిగమించారు. ఫలితంగా ఈసారి పరిస్థితులు మారిపోయాయి. జనసేన బాగా పుంజకుంది. దీనికి టీడీపీ కూడా తోడైంది. ఇక పవన్ ఓడిపోయే ప్రసక్తి అయితే లేదు. పక్కాగా విజయం సాధిస్తారు. ఇక వైసీపీ కూడా కామ్‌గా ఏమీ లేదు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తోంది.

ఈసారి మంచి మెజారిటీ సాధించి ప్రత్యర్థులకు ఝలక్ ఇవ్వాలని జనసేన.. అసలు జనసేనను గెలవనివ్వకూడదని వైసీపీ.. మొత్తానికి ఏపీ రాజకీయం మంచి రంజుమీదుంది. దీనికోసం ఇరు పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఏపీలో తాము గెలవాలనేది సెకండరీ టార్గెట్. ముందుగా ప్రత్యర్థి పార్టీని ఓడించాలన్న లక్ష్యంతోనే పార్టీలు పావులు కదుపుతుంటాయి. దీనికి ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కాదు. ఈ రాజకీయ క్రీడలో గెలిచేదెవరో.. ఓడెదెవరో చూడాలి. 

Sootiga Team

Recent Posts

వైఎస్.. చరిత్ర మరిచిపోలేని పేరు!

వైఎస్ఆర్.. వైఎస్.. యెడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి ఆ పేరే ఒక ప్రభంజనం..! చరిత్ర మరిచిపోలేని పేరు! జనం గుండెల్లో…

July 7, 2024

RTV ఆఫీసుపై ఈడీ దాడులు!!

RTV ఛానల్ ఆది నుంచి చిక్కుల్లోనే మునిగి తేలుతోంది..! ఇప్పటికే ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్న ఈ ఛానల్ ఏపీ, తెలంగాణ…

June 29, 2024

విజయ్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారే!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకున్నా, అది కూడా…

June 29, 2024

చిప్ప కూడు తింటున్నా.. పవిత్ర పొగరు తగ్గలేదే..!

కన్నడ హీరో దర్శన్.. ఆయన లవర్ పవిత్ర ఇద్దరూ హత్య కేసులో ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే. ఐతే…

June 29, 2024

బాబోయ్.. ‘కల్కి’ మూవీకి తొలిరోజే ఇన్ని కోట్లా..?

టాలీవుడ్ నుంచి సరైన సినిమా వచ్చి కొన్ని నెలలు గడుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే గుంటూరు కారం తర్వాత అంత పెద్ద…

June 28, 2024

Kalki 2898AD Review: ప్రభాస్ కల్కి మూవీ రివ్యూ.. పోలా ఆదిరిపోలా!

అవును..'కల్కి' న భూతో.. న భవిష్యత్.. రోమాలు నిక్కపొడిచే సన్నివేశాల చిత్రం! ప్రపంచ ఖ్యాతి అర్హత ఉన్న ప్రశంస వర్షాల…

June 27, 2024