ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నాయి. ఇక నేతల్లో లిస్ట్‌లో తాము ఉంటామో.. లేదోనన్న టెన్షన్ నెలకొంది. టీడీపీ ఇంకా ఒక్క జాబితాను కూడా ప్రకటించలేదు. అసలు సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తైందో లేదో కూడా తెలియడం లేదు కానీ వైసీపీ మాత్రం జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఆరు జాబితాలను విడుదల చేసిన వైసీపీ గత రాత్రి ఏడవ జాబితాను సైతం విడుదల చేసింది.
ఆరవ జాబితాలో 10 మార్పులు జరిగితే ఏడవ జాబితాలో ఇద్దరు ఇన్‌చార్జులను వైసీపీ అధిష్టానం మార్చేసింది. ప్రజాదరణ తక్కువగా ఉన్న వారిని వైసీపీ నిర్మొహమాటంగా పక్కన బెట్టేస్తున్న విషయం తెలిసిందే. కేవలం గెలుపు గుర్రాలకే అవకాశం ఇస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ 82 మందిని మార్చేసిన అధిష్టానం.. నిన్న మరో ఇద్దరిని మార్చేసింది. కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహిధర రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు పార్టీ నిరాకరించింది. ఆయన స్థానంలో కటారి అరవింద యాదవ్‌ను కందుకూరు ఇన్‌చార్జిగా అధిష్టానం నియమించింది.
అలాగే పర్చూరు నియోజకవర్గంలో ఇన్‌చార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌కు హ్యాండ్ ఇచ్చి… పర్చూరుకు యడం బాలాజీని సమన్వయకర్తగా నియమించింది. ఈ సారి జాబితాలో కేవలం రెండు పేర్లే కనిపిస్తున్నాయి. తొలుత 60 మంది ఇన్‌చార్జులను మాత్రమే మారుస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఫిగర్ 80 దాటేసింది. పార్టీ విజయమే థ్యేయంగా వైసీపీ ఈ మార్పులు చేర్పులు చేసింది. మరి వైసీపీకి ఈ మార్పులు ఎంత మేర కలిసొస్తాయో చూడాలి.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…