వైసీపీ 7వ లిస్ట్‌లోనూ మార్పులు.. ఇద్దరికి హ్యాండ్ ఇచ్చిన అధిష్టానం..

వైసీపీ 7వ లిస్ట్‌లోనూ మార్పులు.. ఇద్దరికి హ్యాండ్ ఇచ్చిన అధిష్టానం..

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నాయి. ఇక నేతల్లో లిస్ట్‌లో తాము ఉంటామో.. లేదోనన్న టెన్షన్ నెలకొంది. టీడీపీ ఇంకా ఒక్క జాబితాను కూడా ప్రకటించలేదు. అసలు సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తైందో లేదో కూడా తెలియడం లేదు కానీ వైసీపీ మాత్రం జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఆరు జాబితాలను విడుదల చేసిన వైసీపీ గత రాత్రి ఏడవ జాబితాను సైతం విడుదల చేసింది.

ఆరవ జాబితాలో 10 మార్పులు జరిగితే ఏడవ జాబితాలో ఇద్దరు ఇన్‌చార్జులను వైసీపీ అధిష్టానం మార్చేసింది. ప్రజాదరణ తక్కువగా ఉన్న వారిని వైసీపీ నిర్మొహమాటంగా పక్కన బెట్టేస్తున్న విషయం తెలిసిందే. కేవలం గెలుపు గుర్రాలకే అవకాశం ఇస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ 82 మందిని మార్చేసిన అధిష్టానం.. నిన్న మరో ఇద్దరిని మార్చేసింది. కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహిధర రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు పార్టీ నిరాకరించింది. ఆయన స్థానంలో కటారి అరవింద యాదవ్‌ను కందుకూరు ఇన్‌చార్జిగా అధిష్టానం నియమించింది.

అలాగే పర్చూరు నియోజకవర్గంలో ఇన్‌చార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌కు హ్యాండ్ ఇచ్చి… పర్చూరుకు యడం బాలాజీని సమన్వయకర్తగా నియమించింది. ఈ సారి జాబితాలో కేవలం రెండు పేర్లే కనిపిస్తున్నాయి.  తొలుత 60 మంది ఇన్‌చార్జులను మాత్రమే మారుస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఫిగర్ 80 దాటేసింది. పార్టీ విజయమే థ్యేయంగా వైసీపీ ఈ మార్పులు చేర్పులు చేసింది. మరి వైసీపీకి ఈ మార్పులు ఎంత మేర కలిసొస్తాయో చూడాలి.

Google News