RGV: మీరు మారిపోయారు ఆర్జీవీ సర్.. ఓ కుక్క మీ జీవితాన్నే మార్చేసింది..!

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ (Ramgopal Varma) ఏం చేసినా సంచలనమే. కొన్ని విషయాలపై ఆయన స్పందించే తీరు మాత్రం అబ్బురపరుస్తుంది. కొన్ని విషయాల్లో మాత్రం జనాలకు విపరీతమైన కోపం తెప్పిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు వివాదాలతో ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అలాంటి వర్మ (RGV) ఇటీవలి కాలంలో తనలోని హ్యుమానిటీని బయటకు తీస్తున్నారు. ఈ మధ్య ఓ చిన్నారి వీధికుక్కల దాడిలో బలైన విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

ఆ సమయంలో మేయర్ విజయలక్ష్మి మాట్లాడిన మాటలపై వర్మ స్పందించిన తీరు మాత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. వర్మలో ఇంత మంచి మనసు కూడా ఉందా? అని అంతా అవాక్కయ్యారు. చిన్నారి ఘటన మీద ఆర్జీవి (RGV) స్పందించిన రీతిలో మరెవరూ స్పందించలేదనే చెప్పాలి. మేయర్ తన ఇంట్లో కుక్కలకు ఆహారం తినిపిస్తున్న వీడియోను సోషల్ మీడియాల పోస్ట్ చేసి దానిపై ఒక పోస్ట్ పెట్టారు. మేయర్‌ను కుక్కల మందలో వదిలేయాలన్నారు.

Advertisement

అంతేకాకుండా ట్విట్టర్లో ఓ పోస్ట్ పెడుతూ చిన్నారి కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు నిధుల సేకరణను సైతం చేపట్టారు. ఇప్పటికే కొందరు డబ్బులు కూడా ట్రాన్స్‌ఫర్ చేశారు. మొత్తానికి ఆర్జీవీ (RGV) ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు తాపత్రయ పడుతున్నారు. ఇది చూసిన కొందరు నెటిజన్లు.. ‘మీరు మారిపోయారు సర్.. ఒక కుక్క మీ జీవితాన్నే మార్చేసింది’ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

Advertisement
Sootiga Team

Recent Posts

ఆమెకు నా ఫుల్ సపోర్ట్: రేణు దేశాయ్ సంచలన పోస్ట్

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎన్నికలు దగ్గర పడుతుంటడంతో విజయం కోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.…

April 27, 2024

పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్

హీరోయిన్ల పెళ్లి వార్తలు సర్వసాధారణం. ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందంటూ పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి…

April 27, 2024

వామ్మో శ్రుతిహాసన్.. ఎంతమందికి బ్రేకప్ చెబుతుంది?

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్.. ప్రేమలో పడటమూ కొత్త కాదు.. లేవడమూ కొత్త కాదు. ఇప్పటికి చాలా…

April 26, 2024

హాట్ టాపిక్‌గా అల్లు అరవింద్ కారు.. దీని ధర మరింత హాట్..

సినీ ప్రముఖులు ఏం చేసినా హాట్ టాపిక్కే అవుతూ ఉంటుంది. ప్రతి దానిలోనూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఏది కొన్ని…

April 26, 2024

వివేకా హంతకులు మీలోనే.. మీతోనే.. సౌభాగ్యమ్మకు వైఎస్ లక్ష్మి కౌంటర్!

వైఎస్ ఫ్యామిలీలో నిన్న మొన్నటి వరకూ మాటల యుద్ధం జరగగా.. ఇప్పుడు లేఖల యుద్ధం నడుస్తోంది. ఇదంతా వైఎస్ వివేకా…

April 26, 2024

వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించిన మహేష్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలు.. మరోవైపు వ్యాపార ప్రకటనలు.. ఇంకోవైపు బిజినెస్‌ ద్వారా బీభత్సంగా సంపాదించేస్తున్నాడు. ఇప్పటి…

April 26, 2024