RGV: మీరు మారిపోయారు ఆర్జీవీ సర్.. ఓ కుక్క మీ జీవితాన్నే మార్చేసింది..!

RGV

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ (Ramgopal Varma) ఏం చేసినా సంచలనమే. కొన్ని విషయాలపై ఆయన స్పందించే తీరు మాత్రం అబ్బురపరుస్తుంది. కొన్ని విషయాల్లో మాత్రం జనాలకు విపరీతమైన కోపం తెప్పిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు వివాదాలతో ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అలాంటి వర్మ (RGV) ఇటీవలి కాలంలో తనలోని హ్యుమానిటీని బయటకు తీస్తున్నారు. ఈ మధ్య ఓ చిన్నారి వీధికుక్కల దాడిలో బలైన విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

ఆ సమయంలో మేయర్ విజయలక్ష్మి మాట్లాడిన మాటలపై వర్మ స్పందించిన తీరు మాత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. వర్మలో ఇంత మంచి మనసు కూడా ఉందా? అని అంతా అవాక్కయ్యారు. చిన్నారి ఘటన మీద ఆర్జీవి (RGV) స్పందించిన రీతిలో మరెవరూ స్పందించలేదనే చెప్పాలి. మేయర్ తన ఇంట్లో కుక్కలకు ఆహారం తినిపిస్తున్న వీడియోను సోషల్ మీడియాల పోస్ట్ చేసి దానిపై ఒక పోస్ట్ పెట్టారు. మేయర్‌ను కుక్కల మందలో వదిలేయాలన్నారు.

అంతేకాకుండా ట్విట్టర్లో ఓ పోస్ట్ పెడుతూ చిన్నారి కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు నిధుల సేకరణను సైతం చేపట్టారు. ఇప్పటికే కొందరు డబ్బులు కూడా ట్రాన్స్‌ఫర్ చేశారు. మొత్తానికి ఆర్జీవీ (RGV) ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు తాపత్రయ పడుతున్నారు. ఇది చూసిన కొందరు నెటిజన్లు.. ‘మీరు మారిపోయారు సర్.. ఒక కుక్క మీ జీవితాన్నే మార్చేసింది’ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

Google News