Manchu Manoj – Mohan Babu: మనోజ్ పెళ్లి మోహన్‌బాబుకి ఇష్టం లేదట.. అసలు ఆయన రారట..

Manchu Manoj - Bhuma Mounika Reddy, Mohan Babu

మంచువారి ఇంట మరోసారి పెళ్లి సందడి మొదలైంది. చలువ పందిళ్లతో కళకళలాడుతోంది. మోహన్ బాబు (Mohan Babu) రెండో కుమారుడు, నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) రెండోసారి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తొలుత ప్రణతి రెడ్డి అనే యువతిని వివాహం చేసుకున్న మనోజ్ 2019లో ఆమెకు విడాకులిచ్చాడు. కొంతకాలంగా దివంగత టీడీపీ నేతలు భూమా నాగిరెడ్డి, శోభా రెడ్డి దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికారెడ్డి (Bhuma Mounika Reddy) తో మంచు మనోజ్ డేటింగ్‌లో ఉన్నాడనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

గతేడాది హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండిలో ఒక వినాయక మండపానికి మౌనికతో కలిసి వెళ్లి మనోజ్ (Manchu Manoj) పూజలు చేశాడు. దీంతో వీరిద్దరి రిలేషన్‌షిప్‌కి సంబంధించిన వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఇప్పుడు ఇద్దరూ వివాహమాడబోతున్నారు. రేపు అంటే మార్చి 3వ తేదీన మనోజ్, మౌనిక (Manchu Manoj – Mounika)ల పెళ్లి జరగబోతోంది. అయితే మోహన్‌బాబుకు ఈ పెళ్లి ఇష్టం లేదని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి రకరకాల కారణాలు చెబుతున్నారు.

Manchu Manoj - Bhuma Mounika Reddy

మౌనికారెడ్డికి (Mounika Reddy) కూడా మనోజ్ మాదిరిగానే ఇది రెండో పెళ్లి కావడం ఒక కారణమైతే.. మౌనిక కుటుంబం టీడీపీలో కొనసాగుతుండటం మరొక కారణమట. మోహన్‌బాబు (Mohan Babu) గత కొంత కాలంగా సీఎం జగన్‌ (YS Jagan)తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అలాగే వైసీపీకి పూర్తి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన మౌనిక (Bhuma Mounika)తో తన కుమరుడి వివాహం జరగడం మోహన్‌బాబు (Mohan Babu)కు ఇష్టం లేదనే టాక్ నడుస్తోంది. అసలు మనోజ్ పెళ్లికి మోహన్ బాబు హాజరుకావడం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజమెంతో మరికొన్ని గంటలు ఆగితే కానీ తెలియదు.

Google News