Mahesh Babu: 45 ఏళ్లు దాటినా మహేష్ యంగ్‌గా కనిపించడానికి కారణం ఇదే..

Mahesh Babu Look

సూపర్ స్టార్ మహేష్ బాబు.. (Superstar Mahesh Babu) నలభై ఐదేళ్లు దాటినా కూడా ఇంకా కాలేజ్ కుర్రాడి మాదిరిగానే కనిపిస్తాడు. దానికి కారణం ఫుడ్ విషయంలో జాగ్రత్తలు, వర్కవుట్స్ ఎక్కువగా చేయడం. సుమ (Suma)తో ఇంటర్వ్యూ సమయంలోనూ.. తాను జంక్ ఫుడ్, స్వీట్స్ వంటి వాటి జోలికే వెళ్లనని మహేష్ (Mahesh Babu) చెప్పిన విషయం తెలిసే ఉంటుంది. అలాగే ఫిట్‌నెస్ కోసం మహేష్ జిమ్‌లో ఎక్కువ వర్కౌట్ చేస్తూ ఉంటాడు. షూటింగ్‌కి కాస్త గ్యాప్ దొరికితే చాలు.. జిమ్‌లో వర్కవుట్స్‌లో మునిగిపోతాడు. 

అలాగే స్విమ్మింగ్‌కి సైతం మహేష్ బాగానే సమయం కేటాయిస్తూ ఉంటాడు. మొత్తానికి మహేష్ ఇప్పటికీ యంగ్‌గా కనిపించడానికి చాలా కష్టపడతాడు. మహేష్‌(Mahesh Babu)కి సంబంధించిన వర్కవుట్స్, ఇతర ఫోటోలన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. మహేష్‌ సోషల్ మీడియాలో పెద్దగా కనిపించడు కానీ ఆయన సతీమణి నమ్రత (Namratha) మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటారు. మహేష్‌కు సంబంధించిన పర్సనల్, మూవీ అప్‌డేట్స్ అన్నీ నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌కి ఆనందాన్ని పంచుతూ ఉంటారు. 

Mahesh Babu workouts

తాజాగా మహేష్‌ (Mahesh Babu) వర్కవుట్స్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్‌లో మహేష్ చేతులకు సంబంధించిన ఎక్సర్‌సైజ్ చేస్తూ కనిపించాడు. రెండు పిడికిళ్లను బిగించి పట్టుకుని కనిపించాడు. తన జిమ్ ట్రైనర్ తీసిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్ చూసిన నెటిజన్లు.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikra Srinivas) దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈసినిమాను వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11, 2023న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుందని సమాచారం.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!