Kiran Abbavaram: డేట్ మార్చుకో.. లేదంటే ఓపెనింగ్స్ కూడా రావ్.. కిరణ్ అబ్బవరంకు వార్నింగ్!

Kiran Abbavaram

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు యత్నిస్తున్నాడు. ఇటీవలి కాలంలో వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటి వరకూ చిన్న చిన్న బ్యానర్‌లలోనే పని చేసిన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేస్తూ హిట్ కొడుతున్నాడు. ఇప్పటికే గీతా ఆర్ట్స్‌లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyam Vishnu Katha) సినిమా చేసి ఒక హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్మెంట్ లాంటి బడా నిర్మాణ సంస్థలతో సినిమా చేస్తూ బిజీ అయిపోయాడు. 

మొత్తానికి ‘మీటర్’ (Meter) అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కిరణ్ (Kiran Abbavaram) సిద్ధమవుతున్నాడు. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ద్వారా రమేష్ కాదూరి (Ramesh Kaduri) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లుల నిర్మాణ సారధ్యంలో ఈ మూవీ రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 7న వేసవిలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. 

Raviteja Fans Warning To Kiran Abbavaram

అంతా బాగానే ఉంది కానీ.. ఈ రిలీజ్ డేట్‌ విషయంలోనే పెద్ద చిక్కు వచ్చి పడింది. మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఫ్యాన్స్ దీనిని వ్యతిరేకిస్తున్నారు. రవితేజ నటిస్తున్న రావణాసుర (Ravanasura) మూవీ సైతం ఏప్రిల్ 7నే రిలీజ్ అవుతుండటంతో.. రిలీజ్ డేట్ మార్చుకోవాలని కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)కి సూచిస్తున్నారు. అదే రోజున రిలీజ్ చేస్తే మాత్రం ఓపెనింగ్స్ కూడా కష్టమేనని కిరణ్ అబ్బవరంకు ఒకింత వార్నింగ్ ఇస్తున్నారు. ‘వద్దు బ్రో.. అన్న వస్తున్నాడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ ఈ సినిమా హిట్ విషయంలో నిర్మాతలు మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.

Google News