Kasthuri Shankar: మమ్మల్ని ఆంటీ అని పిలిచేవారు.. వాళ్లనెందుకు అంకుల్ అనరు..!

Kasthuri Shankar

ఆంటీ అని సోషల్ మీడియాలో నెటిజన్లు పిలిచారని ప్రముఖ యాంకర్ అనసూయ(Anasuya) ఓ రేంజ్‌లో ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్‌ వరకూ తీసుకెళ్లి నానా యాగీ చేసింది. ఇక ఆ తరువాత నెటిజన్లు కామ్ అయ్యారో.. లేదంటే అనసూయే మరింత రచ్చ చేయడం ఎందుకని ఆగిపోయిందో తెలియదు కానీ ఆ విషయం సద్దుమణిగింది. ఇక తాజాగా మరో నటి ‘ఆంటీ’ పిలుపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆమె మరెవరో కాదు నటి కస్తూరి (Kasthuri Shankar).

ప్రస్తుతం సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్న కస్తూరి.. ఏ విషయాన్నైనా చాలా బోల్డ్‌గా చెప్పేస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కస్తూరి (Kasthuri Shankar).. స్త్రీల హక్కులు మొదలు రాజకీయాలు, సెక్స్ తదితర అన్ని విషయాల గురించి చర్చిస్తుంది. అలాంటి ఆమెను ఆంటీ అని సంబోధిస్తే ఊరుకుంటుందా? గతంలో అనసూయ.. యాంకర్ సుమ (Anchor Suma)కు తన పిల్లల వయసున్న పిల్లలు ఆంటీ అని పిలిస్తే ఓకే కానీ.. పెద్దవాళ్లు కూడా ఆంటీ అని పిలిస్తే ఎలాగని చెప్పుకొచ్చింది.

Kasthuri Shankar

ఇప్పుడు కస్తూరి (Kasthuri Shankar) సైతం అలాగే చెప్పుకొస్తోంది. చిన్న పిల్లలు ‘ఆంటీ’ అని పిలిస్తే ఓకే కానీ పెద్దవాళ్ళు కూడా ఇలా పిలవడం తప్పు అని ఆమె చెప్తోంది. తమను ఆంటీ అని పిలిచే వాళ్లు మరీ హీరోలను మాత్రం ఎందుకు వదిలేస్తున్నారు? వాళ్లను ఎందుకు అంకుల్ అని పిలవరని ప్రశ్నిస్తోంది. హీరోలను మాత్రం సార్ అని పిలుస్తూ తమను మాత్రం ఆంటీ అని వేధించడమేంటని మండిపడుతోంది. కస్తూరి మొత్తానికి మంచి లాజిక్కుతోనే నిలదీస్తోంది.

Google News