Vennela Kishore: ఇండియన్-2 లేదు.. పాకిస్థాన్-3 లేదు: వెన్నెల కిషోర్

Vennela Kishore on Indian 2

టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ (Vennela Kishore) చేసే కామెడీని ఇష్టపడని వారు ఎవరుండరు చెప్పండి. ఆయనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఆయన కామెడీ టైమింగ్‌కు ఫిదా అవుతుంటారు. ఇక వెన్నెల కిషోర్‌ (Vennela Kishore)కి సంబంధించిన ఓ వార్త ఇటీవల తెగ వైరల్ అవుతోంది. విషయం తెలుసుకున్న వెన్నెల కిషోర్ తనదైన స్టైల్లో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఆ వార్త మరేదో కాదు.. శంకర్ మాగ్నమ్ ఓపస్, ఇండియన్ 2కి వెన్నెల కిషోర్ సంతకం చేశాడనే వార్త వైరల్ అయ్యింది.

కమల్ హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్‌‌లో నటించిన ఈ చిత్రం భారతీయ చలనచిత్ర రంగం ఎంతగానో ఎదురు చూసిన భారీ చిత్రాలలో ఒకటి కావడం విశేషం. శంకర్ సినిమాలో ఒక పాత్రను పొందడం అనేది నటీనటులకు ఒక డ్రీమ్ నెరవేరినట్టే. అది వారు సాధించిన గొప్ప విజయంగా కూడా ఫీలవుతుంటారు. అయితే ఇండియన్ – 2 (Indian 2) సినిమాలో వెన్నెల కిషోర్ విలన్‌లో చేస్తున్నాడంటూ ఒక రూమర్ బయటకు వచ్చింది. అంతే తెగ వైరల్ అయిపోయింది. వెన్నెల కిషోర్ (Vennela Kishore) ఏంటి? విలన్ ఏంటి? కాస్త కూడా ఆలోచించకుండా వైరల్ చేసేశారు.

Vennela Kishore on Indian 2

అసలే మనోడు మాంచి కమెడియన్. ఇక ఇలాంటి వార్తలపై ఎలా స్పందిస్తాడో ప్రత్యేకంగా చెప్పాలా? ‘మీరు ఇండియన్ – 2 (Indian 2)లో విలన్‌గా నటిస్తున్నారట కదా?’ అని సోషల్ మీడియాలో ఓ నెటిజన్ అడిగితే.. వెన్నెల కిషోర్‌ (Vennela Kishore) నవ్వుతూ ఈ రూమర్‌ని కొట్టిపడేశాడు. తను శంకర్ సినిమాకి సంతకం చేయలేదని తెలిపాడు. ‘ఇండియన్ 2లో చెయ్యడం లేదు.. పాకిస్తాన్ 3లో చెయ్యడం లేదు’ అని వెన్నెల కిషోర్ చెప్పాడు. దీంతో నెటిజన్లు ఆయన ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కి ఫిదా అవుతున్నారు.

Google News