ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఇప్పటికే అనేక ఎయిర్ పోర్టులు ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు అత్యంత రద్దీగా ఉంటాయి. నిత్యం ప్రయాణీకులతో కళకళలాడుతుంటాయి. ఐతే, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉండాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల కల. అది ఇప్పుడు నెరవేరబోతోంది.
విశాఖ సమీపంలో భోగాపురం ఎయిర్పోర్ట్(Bhogapuram Airport) రానుంది. రేపు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేస్తారు. దీంతో 4600 కోట్ల పెట్టుబడి రాబోతుందని పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ కరికాల వలవన్ అన్నారు.
ఇక విశాఖలో ఆర్థిక వృద్ధికి భోగాపురం(Bhogapuram) ఎయిర్ పోర్ట్ కేంద్రంగా మారడం ఖాయం. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన సాగిస్తాను అని సీఎం అన్నారు. ఆ దిశగా అడుగులు బలంగా పడుతున్నాయి. ‘‘కేంద్రం నుండి అన్ని అనుమతులు తీసుకొచ్చాం. నో అబ్ జెక్షన్ సర్టిఫికెట్ కూడా వచ్చింది.
రేపు ఎయిర్పోర్ట్, ఆదాని డేటా సెంటర్కు సీఎం జగన్ (YS Jagan) శంకుస్థాపన చేస్తారు. వీటివల్ల 45 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయి,” అని కరికాల వలవన్ తెలిపారు.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…