Bhogapuram Airport: ఏపీ దశ మార్చనున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌

Bhogapuram Airport: ఏపీ దశ మార్చనున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ఇప్పటికే అనేక ఎయిర్ పోర్టులు ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు అత్యంత రద్దీగా ఉంటాయి. నిత్యం ప్రయాణీకులతో కళకళలాడుతుంటాయి. ఐతే, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉండాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల కల. అది ఇప్పుడు నెరవేరబోతోంది.

విశాఖ సమీపంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌(Bhogapuram Airport) రానుంది. రేపు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కి శంకుస్థాపన చేస్తారు. దీంతో 4600 కోట్ల పెట్టుబడి రాబోతుందని పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ కరికాల వలవన్ అన్నారు.

Bhogapuram Airport: ఏపీ దశ మార్చనున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌

ఇక విశాఖలో ఆర్థిక వృద్ధికి భోగాపురం(Bhogapuram) ఎయిర్ పోర్ట్ కేంద్రంగా మారడం ఖాయం. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన సాగిస్తాను అని సీఎం అన్నారు. ఆ దిశగా అడుగులు బలంగా పడుతున్నాయి. ‘‘కేంద్రం నుండి అన్ని అనుమతులు తీసుకొచ్చాం. నో అబ్ జెక్షన్ సర్టిఫికెట్ కూడా వచ్చింది.

రేపు ఎయిర్‌పోర్ట్‌, ఆదాని డేటా సెంటర్‌కు సీఎం జగన్‌ (YS Jagan) శంకుస్థాపన చేస్తారు. వీటివల్ల 45 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయి,” అని కరికాల వలవన్ తెలిపారు.

Google News