Telangana: ఈ నెలంతా తెలంగాణాలో ఉద్యోగ పరీక్షలే

Telangana: ఈ నెలంతా తెలంగాణాలో ఉద్యోగ పరీక్షలే

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో పరీక్షల హడావిడి ఉంది. నిరుద్యోగుల కలలు సాకారం అయ్యేలా ప్రభుత్వం వరుసగా రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహిస్తోంది. 2024 ఉద్యోగాల భర్తీకి వరుసగా ఏడు పరీక్షలు ఈ నెలలో జరుగనున్నాయి. మే 8 నుంచి 22 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఇందుకోసం టీఎస్‌పీఎస్సీ(TSPSC) కసరత్తు పూర్తి చేసింది.

ఇటీవల హ్యాకింగ్, పేపర్ లీకేజ్ వంటి అడ్డంకుల నేపథ్యంలో గ్రూప్‌-1 ప్రిలిమినరీతోపాటు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఏఈఈ), డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(డీఏవో), అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ) పరీక్షలను రద్దు చేశారు. ఈ పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది.

ఈసారి పక్కా ప్రణాళికతో నిర్వహిస్తారు. టీఎస్‌పీఎస్సీ(TSPSC) ఇప్పటివరకు 17,285 ఉద్యోగాలకు 26 నోటిఫికేషన్లు ఇచ్చింది. ఏడు నోటిఫికేషన్ల పరీక్షలు నిర్వహించింది. ఈ నెలలలో 1,540 ఏఈఈ ఉద్యోగాలకు పరీక్ష జరగనుంది.

ఈసారి ప్రత్యకత ఏంటంటే… టీఎస్‌పీఎస్సీ(TSPSC)లో ప్రత్యేకంగా పరీక్షల విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐఏఎస్‌ అధికారి సంతోష్‌కి ఈ బాధ్యతను అప్పగించింది. ప్రశ్నపత్రాల రూపకల్పన మొదలుకొని పరీక్ష ముగిసే వరకు పరీక్షల విభాగం పర్యవేక్షిస్తుంది.

Google News