BRS Leader: హుషారుగా డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో బీఆర్ఎస్ నేత మృతి

Brs Leader

ఇటీవలి కాలంలో గుండె పోటు మరణాలను తరచూ వింటున్నాం. నిన్న ఆరో తరగతి చదివే పాప గుండె పోటుతో మరణించింది. నేడు ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. నేడు జగిత్యాల పట్టణంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత హాజరుకానుండటంతో ఏర్పాట్లు భారీగానే చేశారు.

BRS party councillor husband Narendra

ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ నేతలంతా హుషారుగా డ్యాన్స్ చేస్తున్నారు. వారితో పాటే డ్యాన్స్ చేస్తున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త నరేందర్ డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయాడు. వెంటనే ఆయనను బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ నరేందర్ కన్నుమూశారు.

దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాద ఛాయలు అలువుకున్నాయి. విషయం తెలుసుకున్న కవిత సైతం తన జగిత్యాల పర్యటనను రద్దు చేసుకున్నారు.

Google News