Puttaparthi: నిన్న తెనాలి.. నేడు పుట్టపర్తి.. వైసీపీ వర్సెస్ టీడీపీ

Tension In Puttaparthi

ఇటీవలి కాలంలో వైసీపీ (YSRCP) వర్సెస్ టీడీపీ (TDP) వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిన్న తెనాలి మున్సిపల్ సమావేశంలో చొక్కాలు చించుకుని మరీ కొట్టుకున్నారు. నేడు అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి (Puttaparthi)లో వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి (Ex Minister Palle Raghunath Reddy) వర్గీయుల మధ్య వార్ జరిగింది. శ్రీధర్, పల్లె ఇద్దరూ సవాల్ విసురుకున్నారు. దీంతో నేటి ఉదయం ఇరువురు తమ వర్గీయులతో కలిసి సత్యమ్మ దేవాలయానికి చేరుకున్నారు.

ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు రాళ్లు, చెప్పులతో పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో ఇరువురు నేతల వాహనాలూ ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలోనే పల్లె రఘునాథ్‌ రెడ్డి స్పృహ తప్పి పడిపోయారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి (MLA Sridhar Reddy)ని సత్తెమ్మ దేవాలయం వద్దకు వెళ్లేందుకు అనుమతించారంటూ టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Google News