ఏపీలో ఎవరెవరు ఎక్కడ ఓటు వేశారు? పోలింగ్ శాతమెంతంటే..

ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డిలు కడప జిల్లా పులివెందుల బాకరాపురంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఉండవల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజెనోవా మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి మంగళగిరిలో ఓటు వేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ కడపలో ఓటు వేశారు. 

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా.. సాయంత్రం 5 గంటల వరకు 67.99 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో మహిళలు చురుకుగా పోలింగ్‌లో పాల్గొన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 4.13 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా.. 2.71 కోట్లకు పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో పురుషులు 1.30 కోట్లు అంలే 64.28 శాతం మందికి పైగా ఉండగా.. మహిళలు 1.40 కోట్లకు పైగా 66.84% మంది ఉన్నారు.  

ఏపీ మొత్తం కొన్ని చెదురు మొదురు ఘటనలు మినహా ఎన్నిక మొత్తం ప్రశాంతంగానే కొనసాగింది. కొన్ని చోట్ల మాత్రం టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ నడిచింది. ఇరు పార్టీలు కొట్లాటకు దిగాయి. పల్నాడులో మొత్తంగా 12 చోట్ల ఘర్షణలు జరిగినట్టు ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఒకచోట ఈవీఎంను సైతం ధ్వంసం చేశారు. అయితే చిప్ భద్రంగా ఉండటంతో ఈవీఎంలను మార్చి తిరిగి పోలింగ్ ప్రారంభించినట్టు మీనా తెలిపారు. ఎక్కడా రీ పోలింగ్ అవసరమైతే పడలేదన్నారు. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా కట్టడి చేశామని ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు.

Sootiga Team

Recent Posts

RTV ఆఫీసుపై ఈడీ దాడులు!!

RTV ఛానల్ ఆది నుంచి చిక్కుల్లోనే మునిగి తేలుతోంది..! ఇప్పటికే ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్న ఈ ఛానల్ ఏపీ, తెలంగాణ…

June 29, 2024

విజయ్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారే!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకున్నా, అది కూడా…

June 29, 2024

చిప్ప కూడు తింటున్నా.. పవిత్ర పొగరు తగ్గలేదే..!

కన్నడ హీరో దర్శన్.. ఆయన లవర్ పవిత్ర ఇద్దరూ హత్య కేసులో ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే. ఐతే…

June 29, 2024

బాబోయ్.. ‘కల్కి’ మూవీకి తొలిరోజే ఇన్ని కోట్లా..?

టాలీవుడ్ నుంచి సరైన సినిమా వచ్చి కొన్ని నెలలు గడుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే గుంటూరు కారం తర్వాత అంత పెద్ద…

June 28, 2024

Kalki 2898AD Review: ప్రభాస్ కల్కి మూవీ రివ్యూ.. పోలా ఆదిరిపోలా!

అవును..'కల్కి' న భూతో.. న భవిష్యత్.. రోమాలు నిక్కపొడిచే సన్నివేశాల చిత్రం! ప్రపంచ ఖ్యాతి అర్హత ఉన్న ప్రశంస వర్షాల…

June 27, 2024

కల్కి రిలీజ్ ముందు అదిరిపోయే అప్డేట్..!

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకుడిగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో తెరకెక్కిన సినిమా కల్కి. మరికొన్ని గంటల్లో…

June 26, 2024