విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్, గాయని దంపతులు

ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికారు. ఈ జంట తాము విడాకులు తీసుకుని విడిపోయినట్టు సోషల్ మీడియాలో ఒక ప్రకటనను విడుదల చేసింది. 2013లో ప్రకాష్, సైంధవిలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఒక కూతురు అన్వీ కూడా ఉంది. మానసిక ప్రశాంతతో పాటు ఇద్దరి మెరుగైన జీవితం కోసం విడాకులు తీసుకున్నట్టు వెల్లడించారు. 

ఎంతో ఆలోచించి సైంధవి, తాను విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా జీవీ ప్రకాష్ తెలిపారు. మానసిన ప్రశాంతతో పాటు ఇద్దరి మెరుగైన జీవితాల కోసం ఒకరినొకరం పరస్పర గౌరవంతో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ నిర్ణయం ఇద్దరికీ మంచిదని నమ్ముతున్నట్టు తెలిపారు. తమ నిర్ణయాన్ని అభిమానులు, మీడియా మిత్రులు అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని జీవీ ప్రకాష్ పేర్కొన్నారు. 

ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడైన ఏఆర్ రెహ్మాన్ మేనల్లుడే జీవీ ప్రకాశ్ కుమార్. ఆయన తమిళ్‌తో పాటు తెలుగులో పలు చిత్రాలకు మ్యూజిక్ అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ‘డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా, ఒంగోలు గిత్త, జెండాపై కపిరాజు, ఎందుకంటే ప్రేమంట, రాజాధి రాజా చిత్రాలకు జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. 15కు పైగా చిత్రాల్లో హీరోగా నటించారు.

Sootiga Team

Recent Posts

RTV ఆఫీసుపై ఈడీ దాడులు!!

RTV ఛానల్ ఆది నుంచి చిక్కుల్లోనే మునిగి తేలుతోంది..! ఇప్పటికే ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్న ఈ ఛానల్ ఏపీ, తెలంగాణ…

June 29, 2024

విజయ్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారే!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకున్నా, అది కూడా…

June 29, 2024

చిప్ప కూడు తింటున్నా.. పవిత్ర పొగరు తగ్గలేదే..!

కన్నడ హీరో దర్శన్.. ఆయన లవర్ పవిత్ర ఇద్దరూ హత్య కేసులో ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే. ఐతే…

June 29, 2024

బాబోయ్.. ‘కల్కి’ మూవీకి తొలిరోజే ఇన్ని కోట్లా..?

టాలీవుడ్ నుంచి సరైన సినిమా వచ్చి కొన్ని నెలలు గడుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే గుంటూరు కారం తర్వాత అంత పెద్ద…

June 28, 2024

Kalki 2898AD Review: ప్రభాస్ కల్కి మూవీ రివ్యూ.. పోలా ఆదిరిపోలా!

అవును..'కల్కి' న భూతో.. న భవిష్యత్.. రోమాలు నిక్కపొడిచే సన్నివేశాల చిత్రం! ప్రపంచ ఖ్యాతి అర్హత ఉన్న ప్రశంస వర్షాల…

June 27, 2024

కల్కి రిలీజ్ ముందు అదిరిపోయే అప్డేట్..!

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకుడిగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో తెరకెక్కిన సినిమా కల్కి. మరికొన్ని గంటల్లో…

June 26, 2024