యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై ఓ సంచలనం. తన అరుపులు, కేకలతో ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్‌బాస్ షో ఎవరికి కలిసొచ్చినా రాకున్నా శ్రీముఖికి మాత్రం బీభత్సంగా కలిసొచ్చింది. ఇక ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోతోందంటూ ఎప్పటి నుంచో వార్తలు వినవస్తూనే ఉన్నాయి. అమ్మడికి వయసేమైనా తక్కువా అంటే మూడు పదులు దాటేశాయ్.. ఈమె కంటే చిన్నవాళ్లైన బుల్లితెర నటీమణులకు సైతం పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు.
ఈ ముద్దుగుమ్మ గురించి రోజుకో పెళ్లి వార్త వినిపిస్తూనే ఉంటుంది కానీ పెళ్లి మాత్రం చేసుకోదు. తొలుత నటిగా కెరీర్‌ను ప్రారంభించిన శ్రీముఖికి ఏమాత్రం గుర్తింపు రాలేదు. ఆ తరువాత బుల్లితెర మాత్రం లైఫ్ ఇచ్చింది. అమ్మడికి కావల్సినంత క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ‘పటాస్’తో మొదలైన బుల్లితెర ప్రయాణం ఎక్కడా బ్రేకులు లేకుండా సాగుతోంది. ఈ ఛానల్.. ఆ ఛానల్ అన్న తేడా లేకుండా అన్ని ఛానల్స్‌లోనూ అదరగొడుతోంది.
తాజాగా బుల్లితెరపై శ్రీముఖి పెళ్లెప్పుడనే విషయమై టాపిక్ వచ్చింది. దీనిపై జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు అవినాష్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో అవినాష్‌ను శ్రీముఖి పెళ్లి గురించి యాంకర్ ప్రశ్నించింది. ఆమెకు తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారని.. శ్రీముఖికి తగిన వరుడు దొరికితే ఈ ఏడాది శ్రీముఖి పెళ్లి జరిగే అవకాశం ఉందని తెలిపాడు.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…