యాంకర్ శ్రీముఖికి పెళ్లా? ఈసారైనా నిజమేనా?

యాంకర్ శ్రీముఖికి పెళ్లా? ఈసారైనా నిజమేనా?

యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై ఓ సంచలనం. తన అరుపులు, కేకలతో ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్‌బాస్‌ షో ఎవరికి కలిసొచ్చినా రాకున్నా శ్రీముఖికి మాత్రం బీభత్సంగా కలిసొచ్చింది. ఇక ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోతోందంటూ ఎప్పటి నుంచో వార్తలు వినవస్తూనే ఉన్నాయి. అమ్మడికి వయసేమైనా తక్కువా అంటే మూడు పదులు దాటేశాయ్.. ఈమె కంటే చిన్నవాళ్లైన బుల్లితెర నటీమణులకు సైతం పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. 

ఈ ముద్దుగుమ్మ గురించి రోజుకో పెళ్లి వార్త వినిపిస్తూనే ఉంటుంది కానీ పెళ్లి మాత్రం చేసుకోదు. తొలుత నటిగా కెరీర్‌ను ప్రారంభించిన శ్రీముఖికి ఏమాత్రం గుర్తింపు రాలేదు. ఆ తరువాత బుల్లితెర మాత్రం లైఫ్ ఇచ్చింది. అమ్మడికి కావల్సినంత క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ‘పటాస్’తో మొదలైన బుల్లితెర ప్రయాణం ఎక్కడా బ్రేకులు లేకుండా సాగుతోంది. ఈ ఛానల్.. ఆ ఛానల్ అన్న తేడా లేకుండా అన్ని ఛానల్స్‌లోనూ అదరగొడుతోంది. 

తాజాగా బుల్లితెరపై శ్రీముఖి పెళ్లెప్పుడనే విషయమై టాపిక్ వచ్చింది. దీనిపై  జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు అవినాష్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో అవినాష్‌ను శ్రీముఖి పెళ్లి గురించి యాంకర్ ప్రశ్నించింది. ఆమెకు తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారని.. శ్రీముఖికి తగిన వరుడు దొరికితే ఈ ఏడాది శ్రీముఖి పెళ్లి జరిగే అవకాశం ఉందని తెలిపాడు.