నీలిరంగు చీరలో అనుపమ.. ధరెంతో తెలిసి నెటిజన్లు షాక్..

నీలిరంగు చీరలో అనుపమ.. ధరెంతో తెలిసి నెటిజన్లు షాక్..

టిల్లు స్క్వేర్‌తో మళ్లీ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన ఈ బ్యూటీ తెలుగు, తమిళం వంటి ఇతర భాషల్లోనూ రాణిస్తోంది కానీ స్టార్ డమ్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోంది. చక్కగా ఎలాంటి గ్లామర్ రోల్స్ జోలికి వెళ్లకుండా సినిమాలు చేయడంతో ఫ్యాన్స్ ఆమెకు బాగా కనెక్ట్ అయ్యారు. 

అయితే ఇలాగే ఉంటే స్టార్ ‌డమ్ రాదని అనుకుందో ఏమో కానీ ఎన్నాళ్లని ఒకే రకమైన సినిమాలు చేయడం అనుకుందో ఏమో కానీ ఇటీవల గ్లామర్‌కు గేట్లెత్తేసింది. టిల్లు స్క్వేర్‌ చిత్రంలో లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించి అందరినీ ఆర్చర్యపరిచింది. గతంలో ఎప్పుడూ లేని యాంగిల్‌ను ఈ చిత్రంలో అనుపమ చూపించడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అనుపమనేనా ఇలా నటించిందీ అని అభిమానులు ముక్కున వేలేసుకున్నారు.

నీలిరంగు చీరలో అనుపమ.. ధరెంతో తెలిసి నెటిజన్లు షాక్..

అమ్మడిపై ట్రోల్స్ ఓ రేంజ్‌లో వచ్చాయి. అయితే గ్లామర్‌ రోల్‌ చేస్తే తప్పేముందని సమర్థించుకుంది. మొత్తానికి టిల్లు స్క్వేర్ మూవీతో అనుపమ పారితోషికాన్ని పెంచేసింది.  ఇప్పటి వరకూ కోటి రూపాయల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తన నెక్ట్స్ సినిమాకు డబుల్ చేసిందట. ఇప్పుడు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోందని టాలీవుడ్ టాక్. ఇక తాజాగా నీలిరంగు చీరలో ఉన్న పిక్‌ను అనుపమ సోషల్ మీడియాలో సేర్ చేసింది. చూడటానికి చాలా సింపుల్‌గా సాదాసీదా శారీలా కనిపిస్తున్న ఆ బనారస్ చీర ఖరీదు రూ.15 వేలని తెలియడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Google News