షాకింగ్.. ఈ సినిమాకు ప్రభాస్ రూపాయి కూడా తీసుకోవట్లేదట..

షాకింగ్.. ఈ సినిమాకు ప్రభాస్ రూపాయి కూడా తీసుకోవట్లేదట..

‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఊపరి సలపనంత బిజీగా ఉన్నాడు. ఒకవైపు కల్కి సినిమా చేస్తూనే మరోవైపు రాజా సాబ్‌‌ని లైన్‌లో పెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడు. కల్కి సినిమా షూటింగ్ దాదాపు పూర్తైంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో ప్రభాస్ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

అదేంటే ప్రభాస్.. రూపాయి కూడా తీసుకోకుండా పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడట. షాకింగ్‌గా అనిపిస్తోంది కదా. రూ.100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే హీరో ఏంటి? రూపాయి కూడా తీసుకోకుండా సినిమా చేయడమేంటి? వెంటనే తలెత్తే ప్రశ్నలు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’ రూపొందుతోంది. ఈ చిత్రంలో పరమేశ్వరుడిగా ప్రభాస్ నటించబోతున్నాడంటూ టాక్ నడుస్తోంది. 

అయితే ఇప్పుడేమో ప్రభాస్ పరశురాముడి పాత్రలో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. పాత్ర ఏదైనా కానీ ఈ సినిమా కోసమైతే ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట. మంచు ఫ్యామిలీతో తనకున్న అనుబంధం దృష్ట్యా ఇలా చేశాడని టాలీవుడ్ వర్గాల కథనం. మొత్తానికి ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పాన్ ఇండియా అప్పీల్‌తో ఈ సినిమా తీస్తున్నారు. ఈ నెల 20న క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప’ టీజర్ రిలీజ్ కానుంది. అప్పుడు ప్రభాస్ పాత్రపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Google News