కుర్ర హీరోతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న మృణాల్ ఠాకూర్

కుర్ర హీరోతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న మృణాల్ ఠాకూర్

హీరోయిన్ మృణాల్ ఠాకుర్.. గురించి తెలియని తెలుగు వారుండరు. సీతగా ఈ ముద్దుగుమ్మ తెలుగు వారి గుండెల్లో గొప్ప స్థానమే సంపాదించుకుంది. సీతారామం సినిమాతో ఈ అమ్మడి రేంజే మారిపోయింది. ఆ తరువాత చేసిన సినిమాలు సీతారామం రేంజ్ హిట్ అవకున్నా కూడా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.ఈ బ్యూటీ తాజాగా ఓ యువ హీరోతో చెట్టాపట్టాలేసుకుని కనిపించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.

ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఎప్పుడూ మృణాల్ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఇటీవల ఎగ్ ఫ్రీజింగ్ గురించి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు యువ హీరో సిద్ధాంత్ చతుర్వేది విషయమై వార్తల్లో నిలిచింది. వీరిద్దరూ కలిసి ముంబై మొత్తం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని టాక్. తాజాగా ముంబయిలోని ఓ రెస్టారెంట్‌కి కలిసి వెళ్లారు.

కుర్ర హీరోతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న మృణాల్ ఠాకూర్

దానిదేముంది? రెస్టారెంట్స్‌కు వెళుతూనే ఉంటారు కదా అంటారా? తిరిగి వెళ్లిపోయేటప్పుడు మృణాల్.. సిద్ధాంత్‌ చేతులు పట్టుకుని బయటకు నడుకుంటూ వచ్చింది. ఆపై అతనికి హగ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు వీరిద్దరి మధ్య ఏమైనా ఉందా? అని గుసగుసలాడుకుంటున్నారు. కొందరు మాత్రం వీరిద్దరూ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కోసం కలిసి పని చేస్తున్నారేమో అంటున్నారు.

Google News