తెలుగు అమ్మాయినని.. నల్లగా ఉన్నానని చాలా అవమానించారు: ఈషా రెబ్బ

తెలుగు అమ్మాయినని.. నల్లగా ఉన్నానని చాలా అవమానించారు: ఈషా రెబ్బ

పక్కా తెలుగింటి అమ్మాయిలు ఈషా రెబ్బ. హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ టైం కలిసి రాలేదు. తాను ఇక్కడ మొదటి సినిమా కోసం ఆడిషన్స్‌కి వెళుతుంటే తెలుగు అమ్మాయివని చెప్పకన్నారు. నార్త్ నుంచి వచ్చినట్టుగా చెప్పమని ఫ్రెండ్స్ చెప్పారని తెలిపింది. కానీ అలా చెప్పడం తనకు ఇష్టం లేదని.. అందుకే తాను తెలుగు అమ్మాయిననే చెప్పానని అన్నారు. 

ఇక్కడ తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ రావడం కష్టమేనని తెలిపారు. షూటింగ్ సమయంలో తెలుగు అమ్మాయిలకు ఇబ్బందులేనని వెల్లడించింది. కెమెరా ముందుకు వెళ్లగానే తెలుగు అమ్మాయినని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్లంతా మొహాలు మాడ్చేస్తారట. అదే మలయాళ సినిమాల్లో అయితే ఫస్ట్ ప్రయారిటీ ఆ భాష వచ్చిన వారికే ఉంటుందని తెలిపింది. భాషరాని వాళ్లను పట్టుకుని మలయాళీలు టైం వేస్ట్ చేసుకోరని ఈషా రెబ్బ వెల్లడించింది.

తెలుగు అమ్మాయినని.. నల్లగా ఉన్నానని చాలా అవమానించారు: ఈషా రెబ్బ

తాను తెలుగులో ఒక సినిమా చేసేలోగా ఒక మలయాళ హీరో 6 సినిమాలు చేశాడని తెలిపింది. పైగా తన కెరీర్ ప్రారంభంలో నల్లగా ఉండటం కారణంగా అవమానాలను ఎదుర్కొన్నదట. ఆడిషన్స్‌కి వెళితే.. చాలా నల్లగా ఉన్నావంటూ తనకే చూపించేవారని తెలిపింది. అవకాశాల కోసం ఎవరినైనా కలవాలంటే తనకు భయం వేసేదని వెల్లడించింది. అయితే మొండిగా ఎవరేం అనుకుంటే తనకేంటని ముందుకు వెళ్లానని ఈషా రెబ్బ వెల్లడించింది.