ఫైనల్‌గా జీవితంలోకి ఒకరొస్తున్నారంటూ ప్రభాస్ ట్వీట్.. ఫ్యాన్స్ హ్యాపీ

ఫైనల్‌గా జీవితంలోకి ఒకరొస్తున్నారంటూ ప్రభాస్ ట్వీట్.. ఫ్యాన్స్ హ్యాపీ

పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ ఎదిగాడు. దాదాపు నాలుగు పదుల వయసుకు చేరువవుతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లిస్ట్‌లో టాలీవుడ్‌లో అయితే టాప్‌లో ఉన్నాడు. అలాంటి ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా? అని ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ మాత్రం దీనికి సమాధానం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ప్రభాస్ వాళ్ల పెద్దమ్మ కూడా త్వరలోనే ప్రభాస్ పెళ్లి అని చెప్పారు.

ఈ విషయం చెప్పి చాలా కాలం అవుతోంది కానీ ప్రభాస్ పెళ్లి మాత్రం కాలేదు. కొంత కాలం పాటు అనుష్కతో ప్రేమాయణం అన్నారు ఆ తరువాత మరో హీరోయిన్‌తో డేటింగ్.. ఆపై పెళ్లి అన్నారు. కానీ ఏ ఒక్కటి కూడా పెళ్లి దిశగా అడుగులు పడలేదు. ఇప్పుడు ప్రభాసే ఏకంగా ఓ పోస్ట్ పెట్టాడు. ఇది కాస్తా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ అసలు ప్రభాస్ ఏం పోస్ట్ పెట్టాడంటారా? 

‘ఫైనల్‌గా స్పెషల్ వ్యక్తి లైఫ్‌లోకి రాబోతున్నారు… వెయిట్ చెయ్యండి’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు. అది పెళ్లి గురించేనంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. క్షణాల్లోనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇది చూసి ప్రభాస్ పెళ్లి వార్త చెప్పబోతున్నాడంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. కొందరు మాత్రం అది పెళ్లి గురించి కాదు.. కల్కి మూవీ ప్రమోషన్స్ కోసం ప్రభాస్ అలా చేశాడని అంటున్నారు. ఇక చూడాలి ఏం జరుగుతుందో..