రష్మిక, సాయి పల్లవి, కీర్తిలలో స్టార్ స్టేటస్ ఎవరిది?

రష్మిక, సాయి పల్లవి, కీర్తిలలో స్టార్ స్టేటస్ ఎవరిది?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్‌గా ఓ రేంజ్‌లో హవా చాటిన కాజల్ అగర్వాల్ కానీ.. మిల్కీ బ్యూటీ తమన్నా కానీ.. పూజా హెగ్డే కానీ బాలీవుడ్‌లో పాగా వేసేందుకు చాలా గట్టిగానే ట్రై చేశారు కానీ ఫలితం దక్కలేదు. ఎంత ట్రై చేసినా నిలదొక్కుకోలేకపోయారు. ఆశించిన స్థాయి ఫలితాలను అందుకోలేక పూర్తిగా బాలీవుడ్‌కు దూరమయ్యారు. అయితే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా మాత్రం బాలీవుడ్‌లో గట్టిగానే పాగా వేసింది. 

ఆ తరువాత కీర్తి సురేశ్ .. సాయిపల్లవి ప్రస్తుతం బాలీవుడ్ పైనే బాగా ఫోకస్ పెట్టారు. రష్మిక తెలుగు .. కన్నడ భాషల్లో స్టార్ స్టేటస్‌ను కొనసాగిస్తోంది. ఇక బాలీవుడ్‌లో కూడా స్టార్ స్టేటస్‌ను అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. ‘యానిమల్’ చిత్రం ఆమెకు మంచి హైప్ అయితే ఇచ్చింది. ఈ సినిమాతో మరో రెండు సినిమాలు ఆమె చేతిలో వచ్చి పడ్డాయి. ఈ సినిమాలు కూడా మంచి హిట్ కొట్టాయో అమ్మడికి స్టార్ స్టేటస్ ఎగురుకుంటూ వచ్చి ఒళ్లో వాలుతుంది.

ఇక తమిళ .. తెలుగు భాషల్లో బిజీగా ఉన్న కీర్తి సురేశ్ కూడా బాలీవుడ్‌పై బాగానే ఫోకస్ పెట్టింది. అక్కడ వరుణ్ ధావన్ హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో నటిస్తోంది. ఇది కాక మరో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయట. ఇక సాయిపల్లవి అయితే ఏకంగా జాక్‌పాట్ పట్టేసింది. ‘రామాయణ’ సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా కానీ హిట్ అయ్యిందో అమ్మడి రేంజ్ బాలీవుడ్‌లో అమాంతం పెరిగిపోతుంది. మరి ఈ ముగ్గురు భామలలో ముందుగా ఎవరు బాలీవుడ్‌లో స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటారో చూడాలి.