చేతికి కట్టుతో దర్శనమిచ్చిన ఐశ్వర్యారాయ్.. అసలు ఆమెకు ఏమైంది?

చేతికి కట్టుతో దర్శనమిచ్చిన ఐశ్వర్యారాయ్.. అసలు ఆమెకు ఏమైంది?

మాజీ ప్రపంచ సుంద‌రి, బాలీవుడ్ స్టార్ న‌టి ఐశ్వర్యా రాయ్ బ‌చ్చన్ చేతికి కట్టుతో దర్శనమిచ్చి షాకిచ్చింది. ఫ్రాన్స్‌లో జ‌రుగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లోమెరిసిన ఐశ్వర్య.. క్యాట్‌వాక్ చేసి అలరించారు. మెగాలో పోలిస్ ఫిల్మ్ కోసం ఆమె రెడ్‌కార్పెట్‌పై మెస్మరైజ్ చేసింది. ఆమె కాస్ట్యూమ్స్ అయితే స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. ఫాల్గుణి అండ్ షేన్ పీకాక్ డిజైన‌ర్లు రూపొందించిన బ్లాక్ అండ్ వైట్ క‌ల‌ర్ కాంబోలో గోల్డెన్ పుష్పాల‌తో కూడిన‌ గౌన్‌లో ఐశ్వర్యా రాయ్ మెరిసిపోయింది.

ఈ గౌన్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది త్రీడీ మెటాలిక్ ఎలిమెంట్స్ ఉన్న మోనోక్రోమ్ గౌన్‌ కావడం విశేషం. రెండు దశాబ్దాలుగా ఐశ్వర్యారాయ్ కేన్స్ ఫెస్టివల్‌లో పాల్గొంటోంది. ఇప్పటి వరకూ ఐశ్వర్య కేన్స్ ఫెస్టివల్‌లో 21 సార్లు క్యాట్ వాక్ చేసింది. 2002లో ‘దేవ‌దాస్’ మూవీ ప్రీమియ‌ర్ సంద‌ర్భంగా ఆమె తొలిసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో పాల్గొంది. అంతా బాగానే ఉంది కానీ కుడి చేతికి కట్టు కట్టుకుని ఉండటమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.   

అదేంటా అని ఆరా తీయగా.. ఇటీవలే ఐశ్వర్యారాయ్ చేతికి గాయ‌మైన‌ట్లు తెలిసిందని నెటిజన్లు అంటున్నారు. అసలెందుకు గాయమైందనే విషయం మాత్రం తెలియరాలేదు. ఈ విషయమై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. చేతికి కట్టుతోనే ఆమె క్యాట్ వాక్‌లో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పైగా ఐశ్వర్యకు తోడుగా ఆమె కూతురు ఆరాధ్య ఉండటం కనిపించింది. ఇక ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కియారా అద్వానీ, సోభితా దూళిపాళ‌, ఆదితి రావు హైద‌రీ తదితరులు సందడి చేశారు.