మొన్న ఔట్.. నేడు ఇన్.. ఈ గ్యాప్‌లో ఏం జరిగింది?

మొన్న ఔట్.. నేడు ఇన్.. ఈ గ్యాప్‌లో ఏం జరిగింది?

మెగా బ్రదర్‌ నాగబాబుకు ఆవేశం ఎక్కువ. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తేవడంలో ఆయన దిట్ట. ఈ ఆవేశంతోనే అన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ.. తను ఇరుకున పడటమే కాకుండా జనసేన పార్టీని సైతం ఇరుకున పెడుతూ ఉంటారు. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. పబ్లిక్ లైఫ్‌లో పూల వానలు ఎంత సహజమో రాళ్ల వాన కూడా అంతే సహజం. నాగబాబు తొందరపాటుకు ప్రతిసారీ పార్టీ విమర్శలు స్వీకరించాల్సి వస్తోంది.  పబ్లిక్‌ లైఫ్‌లో ఉన్నప్పుడు పొగడ్తలుతో పాటు విమర్శలు కూడా వస్తుంటాయి. 

ఆవేశంలో ఓ ట్వీట్ వేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకతను నాగబాబు ఎదుర్కొన్నారు. దీంతో అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేశారు. ఏమైందో ఏమో కానీ అంతలోనే తిరిగి యాక్టివేట్ చేశారు. వస్తే వచ్చారు.. సైలెంట్‌గా ఉండొచ్చు కదా.. ఆ ట్వీట్ డిలీట్ చేశానని ట్వీట్ చేశారు. అంటే తప్పు చేశానని నాగబాబు ఒప్పుకున్నట్టే కదా? అని నెటిజన్లు అంటున్నారు.అసలు నాగబాబు మొన్న ట్విటర్ నుంచి ఔట్ అవడానికి.. మళ్లీ ఈ రోజు ఇన్ అవడానికి మధ్య ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.

మెగాస్టార్ చిరంజీవికి పూలతో పాటు రాళ్ల వాన గురించి బాగా తెలుసు. కాబట్టి ఆయన పెద్దగా ఇలాంటివేమీ పట్టించుకోరు.. అవసరమనుకుంటే తప్ప స్పందించరు. ఈ క్రమంలోనే తమ్ముడు నాగబాబుకు చిరు క్లాస్ పీకారని ప్రచారం జరుగుతోంది. ఇటు అల్లు అరవింద్ సైతం కొడుకు అల్లు అర్జున్‌కు క్లాస్ తీసుకున్నారని సమాచారం. మొత్తానికి ఇప్పుడు నాగబాబు, అల్లు అర్జున్ కలిసి పోయారా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇంతటితో వివాదానికి ఫుల్‌ స్టాప్ పడినట్టేనా? లేదంటే మెగా బ్రదర్ పైత్యం మళ్లీ మళ్లీ ప్రదర్శిస్తారా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.