బుల్లితెరపై విషాదం.. ఇద్దరు ఫేమస్ నటుల మృతి.. ప్రియురాలు చనిపోయిందని..

బుల్లితెరపై విషాదం.. ఇద్దరు ఫేమస్ నటుల మృతి.. ప్రియురాలు చనిపోయిందని..

బుల్లితెరపై ఇంతటి విషాదం గతంలో ఎన్నడూ లేదేమో.. సీరియల్ నటి పవిత్రా జయరాం హైదరాబాద్‌లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన మరువక ముందే ఆమె ప్రియడు, సీరియల్ నటుడు చందు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. మణికొండలో చందు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. చందుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఓ సీరియల్‌లో పవిత్రతో కలిసి చందు నటించాడు. 

ఆ సమయంలో వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. పవిత్రతో చందు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పవిత్ర మరణానంతరం కూడా జిమ్ టైమ్ పాప అంటూ చాలా ఆవేదనతో సోషల్ మీడియాలో రీల్స్ పెట్టాడు. ఆమె మరణానంతరం ఆయన పూర్తిగా డిప్రెషన్‌కి వెళ్లిపోవడమే కారణమని తెలుస్తోంది. వీరిద్దరికీ సంబంధించిన చాలా రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అయితే  2015లో శిల్పను చందు ప్రేమ వివాహం చేసుకున్నాడు. ‘త్రినయిని’తో పాటు పలు సీరియల్స్‌లో చందు నటించారు. ఇదే సీరియల్‌లో పవిత్ర విలన్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం వంటి సీరియల్స్‌లో చందు నటిస్తున్నాడు. అయితే చందు ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చందు ఆత్మహత్యకు డిప్రెషనా.. లేదంటే మరేదైనా కారణమా? అన్న కోణంలో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.

Google News