ఎన్టీఆర్ ఫియర్ సాంగ్ రాబోతోంది..

ఎన్టీఆర్ ఫియర్ సాంగ్ రాబోతోంది..

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మాస్ చిత్రం దేవర. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఊర మాస్ గెటప్‌లో దర్శనమివ్వబోతున్నాడు. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఒకక సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అదేంటంటే.. ఈ చిత్రం నుంచి అదిరిపోయే సాంగ్‌ను విడుదల చేయనుంది. 

ఈ పాటను చిత్ర యూనిట్ ఫియర్ సాంగ్‌గా పేర్కొంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ దేవర చిత్ర యూనిట్14 సెకన్ల ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోను ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. మే 19న ఈ సాంగ్‌కు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా నటిస్తున్న తెలుగు చిత్రమిది.

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న తొలి చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. పైగా కొరటాల, ఎన్టీఆర్ కాంబో చాలా సక్సెస్‌ఫుల్ కాంబో. ఇక ఈ చిత్రం ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సాంగ్ విడుదలైతే కానీ ఎన్టీఆర్ కోసం అనిరుథ్ ఏ రేంజ్‌లో మ్యూజిక్ ఇచ్చాడనేది తెలియదు. తాజాగా విడుదల చేసిన సాంగ్ టీజర్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Google News