విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్, గాయని దంపతులు

విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్, గాయని దంపతులు

ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికారు. ఈ జంట తాము విడాకులు తీసుకుని విడిపోయినట్టు సోషల్ మీడియాలో ఒక ప్రకటనను విడుదల చేసింది. 2013లో ప్రకాష్, సైంధవిలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఒక కూతురు అన్వీ కూడా ఉంది. మానసిక ప్రశాంతతో పాటు ఇద్దరి మెరుగైన జీవితం కోసం విడాకులు తీసుకున్నట్టు వెల్లడించారు. 

ఎంతో ఆలోచించి సైంధవి, తాను విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు సోషల్ మీడియా వేదికగా జీవీ ప్రకాష్ తెలిపారు. మానసిన ప్రశాంతతో పాటు ఇద్దరి మెరుగైన జీవితాల కోసం ఒకరినొకరం పరస్పర గౌరవంతో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ నిర్ణయం ఇద్దరికీ మంచిదని నమ్ముతున్నట్టు తెలిపారు. తమ నిర్ణయాన్ని అభిమానులు, మీడియా మిత్రులు అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని జీవీ ప్రకాష్ పేర్కొన్నారు. 

ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడైన ఏఆర్ రెహ్మాన్ మేనల్లుడే జీవీ ప్రకాశ్ కుమార్. ఆయన తమిళ్‌తో పాటు తెలుగులో పలు చిత్రాలకు మ్యూజిక్ అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ‘డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా, ఒంగోలు గిత్త, జెండాపై కపిరాజు, ఎందుకంటే ప్రేమంట, రాజాధి రాజా చిత్రాలకు జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. 15కు పైగా చిత్రాల్లో హీరోగా నటించారు.